Breaking News

ఇకపై డిజిటల్ క్యాలెండర్లు... డైరీలు..

02 nd Sep 2020, UTC
ఇకపై డిజిటల్ క్యాలెండర్లు... డైరీలు..

ఢిల్లీ:  దేశంలో పెరుగుతున్న కరోనా  వైరస్  ఉధృతి,  తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం  ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.రాబోయే సంవత్సరంలో  మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు  ఇతర వస్తువులను ముద్రించకూడదని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు,పండుగ గ్రీటింగ్ కార్డులు లాంటి వాటిని ఇకపై ఇ-బుక్స్ రూపంలో మాత్రమే అందించాలని ఆదేశించింది. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఉత్పాదకత రెట్టింపు, ప్రణాళిక, షెడ్యూలింగ్, అంచనాలకు నూతన సాంకేతిక ఆవిష్కరణల ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడమే కాదు నిర్వహణ కూడా సమర్థవంతంగా ప్రభావవంతంగా  ఉంటుందని తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox