Breaking News

ట్రంప్ కి మళ్ళీ షాకిచ్చిన ట్విట్టర్..ఏకంగా 70 వేల ఖాతాలు క్లోజ్..!

12 th Jan 2021, UTC

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హింసను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ, ఆయన ఖాతాను శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రకటన చేసిన సంగతి విదితమే. ఇప్పటికే ఈ పని చేయడం పై ట్విట్టర్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా, ట్విట్టర్ ఏ మాత్రం దూకుడు తగ్గించలేదు. తాజాగా, మరో డెబ్భై వేల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించి ట్రంప్ కి షాకిచ్చింది.

కాపిటల్ భవనం వద్ద ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు కలకలం రేపిన నేపధ్యంలో, ఈ సమయంలో హింసను ప్రోత్సహించే విధంగా ట్వీట్ లు చేసిన వారి ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఇలాంటి పోస్ట్ లు చేసే ఖాతాలను తొలగించే పనిలో ఉన్నామని ట్విట్టర్ పేర్కొంది. ఇప్పటికే డెబ్భై వేల ఖాతాలను క్లోజ్ చేసినట్లు ప్రకటించింది. 

ట్విట్టర్ సంగతి ఇలా ఉంటె, ఫేస్ బుక్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ట్రంప్ కి మద్దతుగా పోస్ట్ లు చేస్తున్న వారిపై కన్ను వేసింది. ట్రంప్ కి మద్దతుగా అభిశంసను ఆపాలంటూ పోస్ట్ లు చేస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తోంది. తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox