Spain: పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్, భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఈ వ్యవహారం గతేడాది పార్లమెంటులో తీవ్ర దుమారం రేపింది. మన దేశంలో రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ఈ స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ స్పైవేర్ తో స్పెయిన్ ప్రధానమంత్రి ఫోన్ కూడా హ్యాక్ అయినట్లు తాజా సమాచారం.
స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ మొబైల్ ఫోన్‌ను గతేడాది పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేసినట్లు ఆ దేశ ప్రెసిడెన్సీ మినిస్టర్ ఫెలిక్స్ బొలాసో వెల్లడించారు. మే నెలలో రెండు సార్లు ఫోన్‌ను హ్యాక్ చేసినట్లు తెలిపారు. రక్షణ మంత్రి మార్గరిటా రోబెల్స్ ఫోన్లోనూ స్పైవేర్‌ను జొప్పించినట్లు చెప్పారు. ప్రధాని, రక్షణ మంత్రి ఫోన్ల నుంచి కీలక వివరాలను తస్కరించారని, ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే స్పెయిన్ జాతీయ కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ‘‘ఇది అక్రమమైన, చట్ట వ్యతిరేక చర్య. బయటి వ్యక్తులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఫెలిక్స్ అన్నారు. కాగా స్పెయిన్‌లో ఈ పెగాసస్ వ్యవహారం గతంలోనూ కలకలం సృష్టించింది. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో జరిగిన వేర్పాటు ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఫోన్లను 2017 - 2020 మధ్య పెగాసస్‌తో హ్యాక్ చేసినట్లు సైబర్ నిపుణుల బృందం వెల్లడించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఫెలిక్స్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే ఈ స్పైవేర్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు గతేడాది సంచలన కథనం వెలువడింది. భారత్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు పెద్ద ఎత్తున కథనాలు వెల్లువెత్తాయి. దీంతో ఇది కాస్తా దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ స్పైవేర్ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది.

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022