Breaking News

భారత్ లో విడుదల అయిన రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లు..!

25 th Jun 2020, UTC

చైనీస్ మొబైల్ మేకర్ అయిన రియల్ మీ మొబైల్ ఈ మధ్య మొబైల్ తయారీ లో  దూసుకెళ్తోంది. తాజాగా మరో రెండు మొబైళ్లను భారత్ లో విడుదల చేసింది. ఇప్పటికే ఈ ప్రఖ్యాత మొబైల్ కంపెనీ రియల్ మీ ఎక్స్ సిరీస్ లో భాగంగా పలు రకాల మోడల్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ లో మరో రెండు ఫోన్లను తీసుకొచ్చింది. 
 
                 యల్‌మి ఎక్స్3 సిరీస్‌లో భాగంగా రియల్‌మి ఎక్స్3, రియల్‌మి ఎక్స్3 సూపర్ జూమ్ ఫోన్లను తీసుకొచ్చింది. క్వాడ్ రియర్ కెమెరాలు, డ్యూయల్ సెల్ఫీ కెమెరా  వంటి ఫీచర్లు ఈ ఫోన్ లకు ప్రత్యేక ఆకర్షణ గా నిలవనున్నాయి.. రియల్‌మి ఎక్స్3 సిరీస్‌లో ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ఎస్ఓసీ, లిక్విడ్ కూలింగ్ సిస్టం  వంటి ఆకర్షణీయ, అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
 
                 ఫీచరులే కాదండోయ్.. ఈ ఫోన్ల ధరలు కూడా కాస్త రిచ్ గానే ఉన్నాయి.. రియల్‌మి ఎక్స్3 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 24,999 కాగా, 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ. 25,999 గా ఉంది. రియల్‌మి ఎక్స్3 సూపర్ జూమ్ 8జీబీ+128 జీబీ ధర రూ.27,999 కాగా, 12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999 మాత్రమే. ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు  చేసుకోవచ్చు.. ముందస్తు బుకింగ్ కావాలంటే.. ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈనెల 27 వరకు బుక్ చేసుకోవచ్చు.. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox