Breaking News

చైనాకు మళ్లీ షాకిచ్చిన భారత్‌, పబ్జి గేమ్‌ ఓవర్?

29 th Jul 2020, UTC

భారత్ : తెల్లారి లేచింది మొదలు ఎప్పుడెప్పుడు భారత్ మీదకు దండెత్తుదామా అని ఎదురు చూస్తున్న చైనా,పాకిస్తాన్‌తో కలిసి పక్కలో బల్లెంలా తయారవుతోంది. అస్తమానం ఆధిపత్యం కోసం తహతహలాడే డ్రాగన్ కంపెనీ. అన్యాయంగా మన సైనికులను పొట్టన పెట్టుకుంది. అయితే కన్నింగ్ చైనాను ఇక ఏ మాత్రం ఉపేక్షించబోమని,భారత్‌ ఈ పరిణామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కేంద్రం హెచ్చరికలు పంపుతోంది. భారత్ ఇస్తున్న షాక్‌లతో జిన్‌ పింగ్‌ సర్కార్‌కు మైండ్ బ్లాంక్ అవుతోంది. ఈ క్రమంలోనే చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్న భారత్‌,మరికొన్ని యాప్‌లను నిషేధించాలని చూస్తోంది. ఆ లిస్ట్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన పబ్జీ గేమ్‌ కూడా ఉండడం,ఇప్పుడు పబ్జీ గేమ్ లవర్స్‌కు కలవరపెడుతోంది.

పబ్జీ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్‌. త్వరలోనే పబ్జీని బ్యాన్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దాంతో పాటు చైనాతో సంబంధం ఉన్న 275యాప్‌లను నిషేధించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వాటి జాబితాను తయారు చేసి ఉంచినట్లు తెలుస్తోంది. అందులో 47యాప్‌లను నిషేధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అందులో పబ్‌జీ మొబైల్‌, లూడో వాల్డ్, ఇ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ అలీ ఎక్స్‌ప్రెస్‌, జిలీ, బైట్‌ డ్యాన్స్‌కు చెందిన మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ రెస్సో లాంటివి ఉండొచ్చని సమాచారం. కాగా దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఇప్పటికే చైనాకు చెందిన 59యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతో డ్రాగన్ కంట్రీపై డిజిటల్ స్ట్రైక్‌ని ప్రకటించిన భారత్‌. ఆ దేశ ఆదాయానికి గండి కొట్టింది. ఇక భారత్‌ను ఫాలో అవుతూ చైనా యాప్‌లను నిషేధించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఇక భారత్  దేశ భద్రతా కారణాల నేపథ్యంలో గతంలో 59చైనా యాప్‌లపై  నిషేధం విధించింది. తాజాగా మరో 47యాప్‌లను బ్యాన్ చేసింది. నిషేధిత యాప్‌లకు ఇవి క్లోన్లుగా వ్యవహరిస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ చైనా యాప్‌లేనని తేల్చారు అధికారులు. ఇక్కడితో అయిపోలేదు, మరో 275చైనా యాప్‌లను నిషేధించే అంశాన్ని కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత అవతలి వాళ్లకి చేరే అవకాశం ఉండడంతో కేంద్రం ఈ యాప్స్‌పై వేటు వేసింది. ఓవైపు సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు జరుగుతున్న క్రమంలోనే కేంద్రం నిర్మోహమాటంగా ఈ నిర్ణయం తీసుకుంది. చైనా విషయంలో వెనకడుగు వేసేది లేదనే సందేశాన్ని భారత్ మరోసారి గట్టిగా పంపింది. ఈ లిస్ట్‌లో పబ్జి గేమ్‌ కూడా ఉండడంతో ఈ ప్రమాదకరమైన గేమ్‌కు ఎడిక్ట్ అయిపోయిన ఎందరో పబ్జీ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్ వార్తలా మారింది. 

నిజానికి ఈ పబ్‌జీ గేమ్‌ అన్నది చాలా డేంజరస్ గేమ్. ఈ పబ్‌జీ గేమ్‌కి అడిక్ట్ అయిన టీనేజర్స్‌ ఎంతో మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. టిక్‌టాక్ త‌ర్వాత అత్యంత ప్రజాదారణ పొందిన చైనా యాప్ పబ్జీ. ప్లేయర్స్ అన్‌నోన్స్‌ బ్యాటిల్ గ్రౌండ్‌గా పిలిచే ఈ యాప్‌కి లక్షలాది మంది బానిసలైపోయారు.. గంటల తరబడి పిల్లలు పబ్జీ గేమ్ ఆడుతున్నారు. దానికి అడిక్ట్ అయిపోయారు. తిండితిప్పలు మానేసి మరీ ఆడుతున్నారు. ఈ క్రమంలో కొందరు పిచ్చోళ్లుగా మారుతున్నారు. మరికొందరు ఉన్మాదుల్లా తయారవుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఇక ఈ గేమింగ్ అంతా ఒకెత్తు అయితే ఆన్‌లైన్‌లోనే చిన్నగా బెట్టింగ్ కూడా మొదలైంది. పబ్ జీ టోర్నమెంట్స్, లూడో వరల్డ్ లాంటి ఆటలలో ఆన్లైన్ పేమెంట్స్ తో చిన్న చిన్న బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తన కుమారుడు పబ్‌జీ ఆటకు బానిసయ్యాడంటూ ఓ తల్లి ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసిందంటే, జనం ఎంతగా ఈ గేమ్‌కు బానిసలైపోయారో అర్థం చేసుకోవచ్చు.. 

ఈ పబ్జీ  గేమ్‌ని దక్షిణ కొరియాకి చెందిన గేమ్ స్టూడియో బ్లూహోల్ తయారు చేసింది. ఈ గేమ్ పాపులర్ అయ్యాక చైనా కంపెనీ టెన్సెంట్ దీన్ని తమ దేశంలో అనుమతించేందుకు డీల్ కుదుర్చుకుంది. క్రమంగా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని పెంచుకుంటూపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చైనాకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్న భారత్ ఇప్పుడు పబ్‌జీ, లూడో వరల్డ్‌, ఈ రెండు గేమ్స్‌ యాప్‌లపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే  పాకిస్థాన్, నేపాల్, ఇరాక్‌ లు ఈ గేమ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పాపులర్ ఆన్‌లైన్ గేమ్ పబ్ జీని బ్యాన్ చేశాయి. ఎంటర్‌ టైన్‌మెంట్‌ కోసం ఆడే లూడో గేమ్‌ కత్తులతో దాడి చేసుకునే దాకా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నిజానికి  ఈ గేమ్స్ యాప్స్‌ ఇన్‌స్టాల్ చేసుకుని హ్యాపీగా ఆడేస్తున్నాం కానీ. అవి మనకు తెలియకుండానే మన సమాచారాన్ని తస్కరిస్తున్నాయి. పరోక్షంగా మన డేటా మొత్తం లీక్ చేస్తున్నాయి. అందుకే పబ్జీతో పాటు అలీ ఎక్స్‌ప్రెస్‌, లూడో సహా చైనాకు చెందిన 275యాప్‌ల‌పై కేంద్రం నిషేదం దిశ‌గా అడుగులు వేస్తోంది.

ఇక గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి డ్రాగన్‌కు చెందిన యాప్‌ల‌పై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులోభాగంగా ఇప్పటికే టిక్‌టాక్‌, యూసీ బ్రౌజ‌ర్ స‌హా 59యాప్‌ల‌ను నిషేధించింది. ఇప్పుడు జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నా మ‌రో 275చైనా యాప్‌లను గుర్తించారు.. నిబంధ‌న‌ల్ని ఉల్లంఘిస్తూ భార‌త వినియోగ‌దారుల డేటా చోరీకి గురవుతుందంటూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. యాప్‌ బ్యాన్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుద‌ల కానుంది. సో యూత్ ప్రాణాలతో ఆడుకుంటున్న పబ్జీ గేమ్  ఓవర్‌ అయిపోతుందన్నమాట.మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox