Breaking News

ఇక పై వాట్సాప్ లో లాగ్ అవుట్ అవ్వచ్చు..!

18 th Feb 2021, UTC

వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ ల లాగా.. ఇక పై వినియోగదారులు కావాలనుకుంటే వాట్సాప్ నుంచి కూడా లాగ్ అవుట్ అవ్వచ్చు. ఈ కొత్త అప్లికేషన్ వాట్సాప్ త్వరలోనే తీసుకురాబోతోంది. ఈ కొత్త ఫీచర్ వచ్చిన తరువాత.. ఖాతా తొలగించే ఫీచర్ ఇక పై ఉండకపోవచ్చు. 

కొంత సేపు వాట్సాప్ కు బ్రేక్ ఇవ్వాలనుకుంటే.. వాట్సాప్ నుంచి లాగ్ అవుట్ అయిపోవచ్చు. తద్వారా డేటా ఆన్ చేసుకున్నప్పటికీ.. మీకు ఎలాంటి మెసేజ్ లు రావు. ఇప్పటివరకు.. వాట్సాప్ మెసేజ్ లు రాకుండా చేసుకోవడానికి మ్యూట్ పెట్టుకోవాల్సి వచ్చేది. లేదా డేటా ఆఫ్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఫీచర్ వచ్చిన తరువాత ఇక పై లాగ్ అవుట్ చేసేసుకుని మనం డేటా ఆన్ లో ఉంచుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్ ను వాట్సాప్ త్వరలోనే ప్రారంభించబోతోంది. ఆ తరువాత నుంచి.. ఈ ఫీచర్ బీటా వెర్షన్ లోను, బిజినెస్ వెర్షన్ లో కూడా ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఐ ఓ ఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లను సపోర్ట్ చేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox