Breaking News

టిక్ టాక్‌కు షాకిచ్చిన భారత న్యాయవాది..!

02 nd Jul 2020, UTC

                     గాల్వాన్ లోయ వద్ద.. చైనా చేసిన మారణ హోమానికి భారత్ మొత్తం రగులుతోంది. ఈ ఘటన జరిగి  పదిహేను రోజులవుతున్నా.. భారత్ లో ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి.  ఇప్పటికే..పలు ప్రభుత్వాలు చైనా తో కుదుర్చుకున్న ఒప్పందాలను.. ప్రాజెక్ట్ లను రద్దు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. భారత ప్రభుత్వం కూడా చైనా కు చెందిన యాభై ఆప్ లను కూడా రద్దు చేసింది. దీనితో.. అంతర్జాతీయ మీడియా లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.  
 
                      చైనా దూకుడు ని ఎదుర్కోవడానికి.. భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని పలు దేశాలు సమర్ధిస్తున్నాయి.. మరో వైపు.. చైనా కుతంత్రాలకు స్వస్తి చెప్పడానికి.. అన్ని దేశాలు ఇదే పద్దతి ని పాటిస్తే మంచిది అనే విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి..  అయితే.. టిక్ టాక్ మాత్రం ఈ విషయాన్నీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.. తాము ఎవరి భద్రతా కు హాని కలిగించలేదని.. చైనా తో సహా ఏ విదేశానికి.. భారతీయుల సమాచారాన్ని అందించలేదని.. మొత్తుకుంటోంది.. అయితే.. ఈ విషయం పై ప్రభుత్వం స్పందించలేదు.. 
 
                     అంతటితో ఆగకుండా.. టిక్ టాక్ తనకు న్యాయం జరగాలని కోర్టు లో కేసు వేసింది. అయితే.. టిక్ టాక్‌కు మద్దతుగా తాను కోర్టులో వాదించబోనని దిగ్గజ న్యాయవాది తిరస్కరించారు. భారత మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహద్గీ భరత్ కు వ్యతిరేకం గా చైనా ఆప్ తరపున వాదించేది లేదని తేల్చి చెప్పారు. దేశానికి మద్దతు పలుకుతూ చైనా యాప్స్ కోసం వాదించేందుకు భారత్‌లో ఏ న్యాయవాది ముందుకు వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox