Breaking News

ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించాము.. మంత్రి కేటీఆర్

01 st Jun 2022, UTC

గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు.

ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ, దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox