Breaking News

ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్.. మే 11నుంచి కాల్ రికార్డింగ్ సాధ్యం కాదు..

22 nd Apr 2022, UTC

Technology: స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించుకునే ఫీచర్స్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఒకటి. గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉండేది. కానీ ఆండ్రాయిడ్‌ లో వచ్చిన అప్‌డేట్స్‌ తో కాల్ రికార్డింగ్ సదుపాయం నిలిచిపోయింది. అయితే కాల్ రికార్డ్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ యూజర్లు. అయితే త్వరలో ఈ అవకాశం కూడా ఉండదు. 

మే 11 నుంచి కాల్ రికార్డింగ్ సాధ్యం కాదు. మొబైల్ యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా కాల్ రికార్డింగ్ చేయలేరు. స్మార్ట్‌ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఉండదు. మే 11 నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా కాల్ రికార్డింగ్ చేయడం సాధ్యం కాదు. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ స్ట్రాటజీలో భాగంగా కాల్ రికార్డింగ్ ఫీచర్ నిలిపివేస్తున్నట్టు ఆండ్రాయిడ్ 10 వర్షన్ రిలీజ్ చేసినప్పుడు గూగుల్ ప్రకటించింది. అయితే యాక్సెసబిలిటీ ఏపీఐ ద్వారా థర్డ్ పార్టీ యాప్స్ మాత్రం కాల్ రికార్డింగ్ ఫీచర్‌ని అందిస్తూనే ఉన్నాయి.

అయితే ఈ విషయాన్ని గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ డెవలపర్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ మార్పులు మే 11 నుంచి అమలులోకి రానున్నాయి. కాల్ రికార్డింగ్ కోసం ఉపయోగించే యాక్సెసబిలిటీ ఏపీఐకి యాక్సెస్ తొలగించబోతోంది గూగుల్. కాబట్టి థర్డ్ పార్టీ యూజర్లు కూడా కాల్ రికార్డింగ్ చేయడం సాధ్యం కాదు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox