Breaking News

ఒక్క రోజులో రూ.53 వేల కోట్లను నష్టపోయిన ఫేస్ బుక్

27 th Jun 2020, UTC
 ఒక్క రోజులో రూ.53 వేల కోట్లను నష్టపోయిన ఫేస్ బుక్

 నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్బుక్కు ఇస్తున్న యాడ్స్ను నిలిపేశాయియూనిలీవర్‌, టెలికం దిగ్గజం వెరిజాన్‌  ఫేస్‌బుక్‌లో ప్రకటనలను నిలిపివేసేందుకు నిర్ణయించాయి. ఇదే అంశంపై పా కోక కోలా సైతం నెల రోజులపాటు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్‌ ఇవ్వడం నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

హోండా మోటార్‌ కంపెనీ(యూఎస్‌ యూనిట్‌), చాకొలెట్ల సంస్థ హెర్షీ కో సైతం ఇదే స్థాయిలోస్పందించనున్నట్లు పేర్కొన్నాయి. పలు ఇతర కంపెనీలు సైతం ఈ బాటలో నడిచే అవకాశముందని భావిస్తున్నారు. . దీంతో ఫేస్ బుక్  ఒక్క రోజులోనే రూ.53 వేల కోట్లను నష్టపోయింది.

యూఎస్‌లోని డిజిటల్‌ ప్రకటనల మార్కెట్లో ఫేస్‌బుక్‌ సుమారు 23 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు ఈమార్కెటర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అన్ని ప్రాపర్టీస్‌ ద్వారా ఫేస్‌బుక్‌ 3 బిలియన్లమంది యూజర్లను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. 2019లో కంపెనీ డిజిటల్‌ ప్రకటనల ఆదాయం 27 శాతం పుంజుకుని దాదాపు 70 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది.


  అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని  ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ చెప్పారు. విద్వేషపూరిత వ్యాఖ్యల పరిధిని సైతం పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇకపై రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox