Breaking News

జీవన మార్గంగా మారిన డిజిటల్ ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ

19 th Nov 2020, UTC

న్యూఢిల్లీ :ప్ర‌స్తుతం డిజిట‌ల్ ఇండియాను ఇక ఎంతమాత్రం ప్ర‌భుత్వ సాధార‌ణ కార్య‌క్ర‌మంగా చూడ‌టం లేదని, అంతకంటే అది ఒక జీవ‌న మార్గంగా వుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగ‌ళూరు టెక్ స‌మిట్ ను వీడియో కాన్ఫ‌రెన్స్  ద్వారా ప్రారంభించిన ప్రధాని ఈ సందర్బంగా మాట్లాడుతూ పేద‌లకు, ఆద‌ర‌ణ‌కు నోచుకోని వ‌ర్గాల‌ వారికి సంబంధించిన, అలాగే ప్ర‌భుత్వంలో ఉన్న వ‌ర్గాల వారికి జీవ‌న మార్గంగా డిజిటల్ ఇండియా మారిపోయింద‌ని హర్షం వ్యక్తం చేసారు., 

సాంకేతిక విజ్ఞానం ద్వారా మాన‌వుల గౌర‌వం ఇనుమడించిందన్నిరు. కోట్ల కొద్దీ రైతులు ఒక క్లిక్ ద్వారా న‌గ‌దు సాయాన్నిఅందుకొంటున్నార‌ని, ప్ర‌పంచంలో అతి పెద్ద ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కం అయిన ‘ఆయుష్మాన్ భార‌త్’ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ంటూ ఆయ‌న ప్ర‌స్తావించారు. సాంకేతిక విజ్ఞానం భార‌త‌దేశంలో పేద ప్ర‌జ‌లు లాక్ డౌన్ శిఖ‌ర స్థాయిలో ఉన్న కాలంలో కూడా స‌రైన సాయాన్ని, సత్వరమే అందుకొనేందుకు పూచీ ప‌డింద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ స‌హాయానికి సాటి రాగ‌లిగిన‌వి మ‌రేవీ లేవ‌ని ఆయ‌న అన్నారు. డాటా ఎన‌లిటిక్స్ శ‌క్తి ని ప్ర‌భుత్వం మెరుగైన సేవల విత‌ర‌ణ‌కు, ఆయా సేవ‌ల‌ను స‌మ‌ర్థ‌ంగా అందించడానికి గాను  వినియోగించుకొంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

మా ప‌థ‌కాలు ఫైళ్ళలో నుంచి బయటపడి, ప్ర‌జ‌ల జీవితాలను అంత త్వరగానూ, అంత పెద్ద ఎత్తున మార్చివేశాయంటే అందుకు ముఖ్య కార‌ణం సాంకేతిక‌త‌ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. సాంకేతిక విజ్ఞానం కార‌ణంగానే మ‌నం అంద‌రికీ విద్యుత్తును స‌మ‌కూర్చ‌గలగడంతో పాటు దారి సుంకం కేంద్రాల‌ను శీఘ్ర గ‌తి న దాటి పోగ‌లుగుతున్నామ‌ని, త‌క్కువ కాలంలో విస్తార‌మైన జ‌నాభాకు టీకా మందు ఇప్పించ‌గ‌ల‌మ‌న్న విశ్వాసాన్ని కూడా సాంకేతిక విజ్ఞానం మనకు అందిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.మ‌హ‌మ్మారి కాలంలో సాంకేతిక రంగం తనదైన పనితీరును క‌న‌బ‌రచినందుకుగాను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసలు కురిపించారు. ఎక్క‌డి నుంచైనా ప‌ని చేయ‌డం అనే ధోర‌ణి ఒక నియ‌మంగా మారిపోయింది, ఇది ఇక మీద‌ట కూడా కొన‌సాగుతుంది అని ఆయన అన్నారు. విద్య‌, వైద్యం, వ‌స్తువుల కొనుగోలు మొద‌లైన రంగాల‌లో విరివిగా సాంకేతిక‌త‌ను అనుస‌రించ‌డాన్ని గమనించవచ్చని ఆయ‌న అన్నారు.యుపిఐ, నేశన‌ల్ డిజిట‌ల్ హెల్త్ మిశన్‌, స్వామిత్వ ప‌థ‌కం వంటి కార్య‌క్ర‌మాలు ఈ రకమైన ఫ్రేమ్ వ‌ర్క్ స్థాయి మ‌న‌స్త‌త్వం క‌లిగిన‌వే అని ఆయ‌న చెప్పారు. ర‌క్ష‌ణ రంగం మ‌రింత‌ అభివృద్ధి చెంద‌డానికి సాంకేతిక విజ్ఞానం గ‌తిని అందిస్తోంది అని ఆయ‌న అన్నారు.  

సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం అమాంతం పెరిగిపోతుండటంతో స‌మాచార ప‌రిర‌క్ష‌ణ, సైబ‌ర్ సెక్యూరిటీ ల అవ‌స‌రం కూడా పెరిగిపోయింది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారుమ‌న స‌మాచార, సాంకేతిక విజ్ఞాన (ఐటి) రంగం మ‌న‌ం గ‌ర్వ‌ించేదిగా నిలువగలదన్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.ఈ కార్యక్ర‌మం లో ఇలెక్ట్రానిక్స్‌ & ఐటి, క‌మ్యూనికేశన్స్‌, చ‌ట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్‌, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ బి.ఎస్‌. య‌డియూర‌ప్ప లు కూడా పాల్గొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox