Breaking News

Delhi High Court: ట్విటర్ పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

29 th Mar 2022, UTC

Delhi: హిందూ దేవతలకు వ్యతిరేకంగా పదేపదే అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిపై ట్విట్టర్ చర్యలు తీసుకోకపోవడం పట్ల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప వ్యక్తిగత ఖాతాలను బ్లాక్ చేయలేమని ట్విట్టర్ చెప్పిన సమాధానం పై మండిపడింది.

ఇది లాజిక్ అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారు? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం ప్రశ్నించింది .ఇది అంతిమంగా వివాదాన్ని పెంచడమే, మీరు సున్నితంగా భావించే వ్యక్తుల కంటెంట్‌ను బ్లాక్ చేస్తారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని ఇతర వ్యక్తుల సున్నితత్వాల గురించి, జాతుల గురించి మీరు బాధపడటం లేదు. వేరే మతానికి సంబంధించి ఇలాంటివి జరిగితే, మీరు చాలా జాగ్రత్తగా, మరింత సున్నితంగా ఉంటారని మేము ధైర్యంగా చెప్పగలం అని ఘాటుగా స్పందించారు.

కాళికా దేవి సహా ఇతరు హిందూ దేవతలపై అభ్యంతరకరమైన పోస్టులను పెట్టిన ‘ఎథిస్ట్‌రిపబ్లిక్’ ట్విట్టర్ ఖాతాను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం. ట్విట్టర్ చర్యలపై అసహనం వ్యక్తం చేసింది. వాదనలు వినిపించిన ట్విట్టర్. అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించి, ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు కోర్టుకు తెలిపింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox