Breaking News

ఆప్ ల నిషేధం పై లబోదిబోమంటున్న చైనా మీడియా..!

02 nd Jul 2020, UTC

ఇంతకాలం తానె అగ్రదేశమన్నట్లు  విర్రవీగిన చైనా కు భారత్ ఇచ్చిన షాక్ కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది.  గాల్వాన్ లోయ వద్ద చైనా వ్యవహరించిన దాష్టీకానికి యావత్ భారతం ఆగ్రహం తో ఊగిపోతోంది. చైనా ను వ్యతిరేకిస్తూ.. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా తమ నిరసనలు తెలుపుతున్నారు. రాజకీయ నాయకులూ, ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు సైతం చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.
 
            ఇప్పటికే.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు చైనా కంపెనీ తో ఉన్న వ్యాపార సంబంధాల్ని రద్దు చేసుకుంటున్నాయి.. మరో వైపు ఇండియన్ రైల్వే సైతం దాదాపు 470 కోట్ల ప్రాజెక్ట్ నుంచి చైనాను తప్పించింది. మరో వైపు.. మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు చైనా ప్రాజెక్టులను రద్దు చేసింది. ఈ ప్రాజెక్ట్ ల విలువ సుమారు ఐదువేల కోట్లు ఉంటుంది.. ఈ నేపధ్యం లో కేంద్ర ప్రభుత్వం కూడా.. యాభై చైనా యాప్ లను భరత్ లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. మొదట టిక్ టాక్ ఆప్  స్పందించింది. తామేమి సమాచార చోద్యానికి పాల్పడలేదంటూ వివరణలు ఇచ్చింది. 
 
           ఈ విషయమై.. చైనా మీడియా ఇపుడు లబోదిబో అంటోంది. ఇప్పటివరకూ చైనా ప్రభుత్వానికి వంత పాడుతూ వచ్చిన అక్కడి జాతీయ మీడియాకు క్షేత్రస్థాయిలో పరిస్థితి కళ్లుబైర్లు కమ్మేలా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా ఉత్పత్తులకు భారతీయులు అలవాటు పడ్డారు.. మేం లేకపోతే పనికాదు అన్నట్టు.. ఇప్పటివరకు చైనా కు చెందిన జాతీయ మీడియా వార్తలు రాసుకొచ్చింది. టిక్‌టాక్, హలో, విగో వీడియో యాప్‌ల నిషేధం కారణంగా ఏకంగా 45 వేల కోట్ల రూపాయల వరకూ  నష్టం వచ్చే అవకాశం ఉందని... ఎట్టకేలకు అసలు విషయం బయట పెట్టింది.. ఐతే.. దీనివల్ల చైనా పెట్టుబడి దారులు భారత్ పై నమ్మకం కోల్పోయారంటూ.. చైనా నే వెనకేసుకొచ్చింది. దీన్ని నుంచి కోలుకునేందుకు భారత్ సుదీర్ఘకాలం పడుతుందని బెదిరింపు ధోరణి లో బెట్టు చేసింది. అయితే.. భారత ప్రభుత్వం మాత్రం.. కేవలం భద్రతా దృష్ట్యా ఈ ఆప్ లను రద్దు చేసినట్లు ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox