Breaking News

ఇక పై లాక్ చేసినా యూట్యూబ్ వినిపిస్తుంది..!

12 th Oct 2020, UTC

మనం యూట్యూబ్ లో మనకి నచ్చిన పాట ఏదైనా ఈజీగా వినేస్తుంటాం. కానీ అది స్క్రీన్ ని ఆన్ లో ఉంచినంతవరకే సాధ్యమవుతుంది. దీనితో మనకి ఫోన్ పట్టుకుని కూర్చునే ఖాళీ ఉంటె తప్ప యూట్యూబ్ లో సాంగ్స్ వినలేము. మనం జర్నీలో ఉన్నపుడు. బైక్ డ్రైవింగ్ లో ఉన్నపుడు యూట్యూబ్ లో వీడియో సాంగ్స్ వినాలంటే చాలా కష్టం అయిపోతుంది. కేవలం ఫోన్ లో ఉండే మ్యూజిక్ ఆప్ తోనో లేక ఎఫ్‌ఎం రేడియోనో అయితేనే వినగలుగుతాం.

ఇకపై ఈ ప్రాబ్లెమ్ కి చెక్ పెట్టేయొచ్చు. యూట్యూబ్‌ ప్రీమియమ్‌ సర్వీసు అవసరం లేకుండానే మొబైల్‌ లాక్‌ పడినా/ వేసినా ఎంచక్కా పాటలు వినొచ్చు. మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటె చాలు. ఎంచక్కా పాటలు వినేయొచ్చు. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ క్రోమ్ బ్రౌసర్ ని ఓపెన్ చేసి యూట్యూబ్‌లో మీకు నచ్చిన వీడియో లింక్ ను ఫైర్‌ఫాక్స్‌/క్రోమ్‌ బ్రౌజర్‌ అడ్రెస్‌ బార్‌లో కాపీ చేయాలి. అయితే మొబైల్ స్క్రీన్ లా ఉండే యు ట్యూబ్ పేజీ  కంప్యూటర్‌ స్క్రీన్‌లా మారుతుంది. అపుడు వీడియోను ప్లే చేసి స్క్రీన్ ని లాక్ వేసినా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. వరుసగా పాటల్ని ప్లే లిస్ట్ లో పెట్టుకుని ప్లే చేస్తే మీరు దానిని ఆపేవరకు పాటలు ప్లే అవుతూనే ఉంటాయి. 

యాపిల్ ఫోన్ యూజర్లు కూడా ఇలా యూట్యూబ్ పాటలను వినొచ్చు. యాపిల్ ఫోన్ లలో సఫారీ బ్రౌజర్‌ ఉంటుంది. యూట్యూబ్‌లో మీకు నచ్చిన వీడియో లింక్ ను బ్రౌజర్‌ అడ్రెస్‌ బార్‌లో పేస్ట్ చేయాలి. ఆ తరువాత టాప్‌లో ఎడమవైపు ఉన్న Aa బటన్‌ను క్లిక్‌ చేసి 'రిక్వెస్ట్‌ డెస్క్‌టాప్‌ సైట్‌' అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అపుడు మొబైల్ స్క్రీన్ డెస్క్ టాప్ లా మారిపోతుంది. స్క్రీన్ ఆఫ్ చేయగానే పాటలు కూడా ఆగిపోతాయి. కానీ పైన కంట్రోల్ ఒప్షన్స్ వస్తాయి. వాటిలో మీరు ప్లే, ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్, స్టాప్ వంటి బటన్స్ ద్వారా వీడియో సాంగ్స్ ను వినొచ్చు. క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో కూడా ఈ ఆప్షన్‌ పని చేసినా ఎక్కువ సమయం ప్లే అవ్వదు. అయితే ఈ ఆప్షన్స్ తో పాటు కొన్ని థర్డ్ పార్టీ ఆప్ లు కూడా ఉన్నప్పటికీ, అన్ని వీడియోలను సపోర్ట్ చేయవు. ఒకవేళ సపోర్ట్ చేసిన ఎక్కువ కాలం పని చేయవు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox