Breaking News

కరోనా వుందని తేలడంతో రైలు నుంచి దింపి ఆసుపత్రికి తరలింపు..!

04 th Jun 2020, UTC

కరోనా  నేపధ్యంలో దేశంలో రైల్వేలు పోషించిన పాత్ర గురించి  ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ప్రయాణీకుల రైళ్లను తిరిగి ప్రారంబించినప్పటికీ ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించి మరీ ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
తాజాగా రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ ఉందని తేలడంతో అతన్ని మార్గమధ్యంలోనే తిరుచ్చి రైల్వేస్టేషనులో రైలు నుంచి కిందకు దించి ఆసుపత్రికి తరలించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి పట్టణంలో వెలుగుచూసింది.

 శివగంగా జిల్లా కరైకుడి ప్రాంతానికి చెందిన ఓ ప్రయాణికుడు విల్లుపురం నుంచి మధురై నగరానికి వెళ్లేందుకు బుధవారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు ఎక్కే ముందు అతని నుంచి శ్వాబ్ ను సేకరించి పరీక్ష కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

 అతనికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చింది. దీంతో రైలులో ప్రయాణిస్తున్న సదరు కరోనా బాధితుడిని రైలు గమ్యస్థానం చేరక ముందే తిరుచ్చిలో దించివేసి అతన్ని ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషను నుంచి అంబులెన్సులో తిరుచ్చిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox