Breaking News

యూట్యూబ్ లో షాపింగ్ ఫీచర్..గూగుల్ కొత్త స్కెచ్..!

12 th Oct 2020, UTC

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ షాపింగ్ సంస్థలతో ఇక పై గూగుల్ వారి యూట్యూబ్ కూడా పోటీ పడడానికి సిద్ధం అవుతోంది. ఈ మేరకు గూగుల్ ప్లాటుఫామ్ పని చేస్తోందని సమాచారం. రాబోయే కొత్త ఫీచర్ల ద్వారా యూట్యూబ్‌లో కూడా షాపింగ్ చేసే ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. గూగుల్ సరికొత్త ప్లానింగ్ తో ఇప్పటికే ఈ కామర్స్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలను యూట్యూబ్ ఢీ కొట్టబోతోంది. కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ఆన్ లైన్ షాపింగ్ కు మరింత ప్రాచుర్యం పెరిగింది. 

ఈ నేపధ్యంలో ప్రజల పల్స్ తెలుసుకున్న గూగుల్ ఇక పై తన వీడియో హబ్ యు ట్యూబ్ ని షాపింగ్ ప్లాట్ ఫామ్ గా మార్చేయాలని చూస్తోంది. ఇకపై ఏ ప్రోడక్ట్ కొనాలన్నా ఈ కామర్స్ సంస్థల సైట్లకు వెళ్లే పని లేకుండా నేరుగా యూట్యూబ్ లోంచి వీడియో చూసుకుని కొనేయచ్చు. ఈ మేరకు ఫీచర్ల కోసం యు ట్యూబ్ క్రియేటర్లను సంప్రదించింది అని సమాచారం. ప్రొడక్టుల ఫీచర్లను ట్యాగ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వీలుగా బటన్స్ ని కూడా అప్ డేట్ చేయనున్నారు. వీడియోలు చూస్తూనే సులభంగా షాపింగ్ చేసేలా యూట్యూబ్‌ను మార్చాలని గూగుల్ యోచిస్తోంది. వీడియో లనే క్యాటలాగ్స్ గా చూపిస్తూ వాటిపైనే బటన్ క్లిక్ చేస్తే కొనుగోలు చేసుకునే విధంగా అప్లికేషన్ ను అప్ డేట్ చేయాలనీ గూగుల్ భావిస్తోంది. అయితే తొందరలోనే యూట్యూబ్ షాపింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox