Best Mobiles Under 10000: అరాచకం భయ్యా.. అనువైన ధర.. అద్భుతమైన ఫీచర్లు.. రూ.10 వేలలో ఖతర్నాక్ ఫోన్లు..!

Best Mobiles Under 10000: రూ.10 వేల బడ్జెట్‌లో కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఇప్పుడు తక్కువ ధరలోనే అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ఫోన్‌లలో ఫీచర్లు కూడా హైరేంజ్‌లో ఉంటాయి. వీటి లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.  ఈ మొబైల్‌పై ప్రత్యేక ఆఫర్‌లు, తగ్గింపులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పాకెట్ ఫ్రెండ్లీ మొబైల్స్. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. Moto G35 5G
ఇటీవల మోటరోలా తన బడ్జెట్ ఫోన్‌గా Moto G35 5Gని భారతదేశంలో విడుదల చేసింది. 4GB RAM + 128GB స్టోరేజ్‌తో దీని ఏకైక వేరియంట్ ధర రూ.9,999. డిసెంబర్ 16 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. 12 5G బ్యాండ్‌లతో సెగ్మెంట్‌లో ఇది అత్యంత వేగవంతమైన 5G ఫోన్ అని కంపెనీ పేర్కొంది.

ఇది 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీనిలో Unisoc T760 చిప్‌సెట్‌ ఉంది. ఫోన్ Android 14 ఆధారంగా Hello UIపై నడుస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ 20W వైర్డు ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

2. Lava O3 Pro
లావా ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది 4G ఫోన్. ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది, ఇక్కడ 4GB RAM+ 128GB స్టోరేజ్‌తో ఉన్న ఏకైక వేరియంట్ ధర రూ.6,999. ఇది గ్లోసీ వైట్, గ్లోసీ పర్పుల్, గ్లోసీ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్‌తో వస్తుంది. దీనిలో Unisoc T606 చిప్‌సెట్‌ ఉంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ వెనుక కెమెరా,  సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ 10W ఛార్జింగ్, టైప్-సి పోర్ట్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

3. Redmi A4 5G
రూ.10 వేల లోపు బడ్జెట్‌లో కూడా ఈ రెడ్మీ ఫోన్ మంచి ఆప్షన్‌గా ఉండొచ్చు. దీన్ని నవంబర్‌లో భారతదేశంలో ప్రారంభించారు. ఫోన్  4GB + 64GB వేరియంట్ ధర అమెజాన్‌లో రూ. 8,498, 4GB + 128GB వేరియంట్ ధర రూ.9,498కి అందుబాటులో ఉంది. ఇది పర్పుల్, బ్లాక్ కర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ 6.88 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ Snapdragon 4s Gen 2 చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.

4. Vivo Y18t
Vivo ఈ ఫోన్‌ను నవంబర్‌లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. 4GB RAM+ 128GB స్టోరేజ్ కలిగిన ఫోన్ ఏకైక వేరియంట్ ధర రూ.9,499. ఇది జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Unisoc T612 చిప్‌సెట్‌పై ఫోన్ రన్ అవుతుంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా,సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

5. Vivo Y18i
Vivo కొన్ని నెలల క్రితం ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Vivo Y18i 10 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి ఎంపిక. ఇది 4G ఫోన్. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది, ఇక్కడ 4GB RAM మరియు 64GB స్టోరేజీ ఉన్న ఏకైక వేరియంట్ ధర రూ.7,999. ఇది జెమ్ గ్రీన్ మరియు స్పేస్ బ్లాక్ రంగులలో కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో Unisoc T612 చిప్‌సెట్‌ ఉంటుంది. ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా, సెల్ఫీ కోసం 5-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ 15W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.