Redmi Note 13 Pro+ 5G: మిస్ అయితే అంతే.. రెడ్‌మి 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. రాసి పెట్టుకోండి..!

Redmi Note 13 Pro+ 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ Redmi Note 13 Pro+ 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు దాని లాంచింగ్ ప్రైస్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోన్‌లో లభించే ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు దీన్ని రూ. 8,000 తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం బెటర్ ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలానే శక్తివంతమైన కెమెరాతో పాటు అనేక హెవీ స్పెసిఫికేషన్లు కూడా ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 19 నిమిషాల్లో ఫోన్‌ను ఫుల్‌గా ఛార్జ్ చేయొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ జనవరిలో ప్రారంభించిన నోట్ 13 సిరీస్ టాప్ వేరియంట్.  ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 13 5 జి, రెడ్‌మి నోట్ 13 ప్రో 5 జి, రెడ్‌మి నోట్ 13 ప్రో + 5 జి అనే మూడు మోడల్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 8GB+256GB వేరియంట్‌కు రూ. 31,999, 12GB+256GB వేరియంట్‌కు రూ. 33,999. 12GB+512GB వేరియంట్‌కు రూ. 35,999. కానీ ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో వేల రూపాయల చౌకగా అందుబాటులో ఉంది.

ఫోన్  8GB+256GB వేరియంట్ అమెజాన్‌లో రూ.27,999, 12GB+256GB వేరియంట్ రూ.29,999, 12GB+512GB వేరియంట్ రూ.31,999గా ఉన్నాయి. అంటే ఈ మూడు వేరియంట్‌లు లాంచ్ ధర కంటే రూ. 4000 తక్కువకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అమెజాన్ దీనిపై బలమైన బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

Redmi Note 13 Pro+ 5G Specifications
ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, డాల్బీ విజన్, 1800 nits పీక్ బ్రైట్‌నెస్, HDR 10+, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 7200 చిప్‌సెట్ ఉంటుంది. అత్యంత ప్రత్యేకత ఏమిటంటే దాని కెమెరా.

ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది OIS, EISతో కూడిన 200-మెగాపిక్సెల్ Samsung ISOCELL HP3 మెయిన్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ టైప్-సి పోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.  120W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఫోన్ బాక్స్ లోనే ఛార్జర్ ఉంటుంది. 19 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.