Breaking News

ఐపీఎల్ లో ఇక పై నో చైనా స్పాన్సర్స్..?

02 nd Jul 2020, UTC
ఐపీఎల్ లో ఇక పై నో చైనా స్పాన్సర్స్..?
              ఎరక్కపోయి చైనా వచ్చి భారత్ తో పెట్టుకుంది..భారత్ ఇక చైనా దుమ్ము దులిపే పని లో పడింది. ఇప్పటికే.. గాల్వాన్ లోయ వద్ద చైనా వ్యవహరించిన తీరుపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ సంగతి సరే సరి.. చైనా లిబ‌రేష‌న్ ఆర్మీ భార‌త సైన్యం ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు, 21మంది భారత జవాన్లు అమరులైన తరువాత పరిస్థితి లు అన్ని మారిపోయాయి.. చైనా కు భారత్  కు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది. భారత్ లో ప్రజలందరికి చైనా  పై పట్టలేనంత కోపం గా ఉంది.
 
               ఇప్పటికే.. రైల్వే తో సహా పలు ప్రాజెక్ట్ లు చైనా కంపెనీ లను తప్పించాయి.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చైనా కంపెనీ లతో తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం కూడా చైనా కు చెందిన 50 యాప్ లను బాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటె.. మరో వైపు.. ఐపీఎల్ అక్టోబర్ లో నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ అంటే కాసుల వర్షమే.. విదేశీ ఆటగాళ్లు సైతం ఇందులో ఆడటానికి మొగ్గు చూపుతుంటారు. ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారు. 
 
             అయితే.. ఐపీఎల్ లో కూడా.. చైనా కు చెందిన కంపెనీ లను ఇన్వెస్ట్మెంట్ ల నుంచి తప్పించనున్నారు. చైనా దేశానికి చెందిన కంపెనీల స్పాన్స‌ర్ షిప్స్ పై కూడా నిషేధం విధిస్తార‌న్నచర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఐపీఎల్ పై స‌మీక్షించే తేదీలు ఇంకా ఖ‌రారు కాలేదు. కానీ భార‌త క్రికెట్ బోర్డుకు ఆట‌తో పాటు దేశ ప్ర‌యోజ‌నాలు కూడా ముఖ్యం అని బోర్డు స్ప‌ష్టం చేసింది. అక్టోబర్ నాటికీ ఉండే పరిస్థితులు.. భారత ప్రభుత్వం ఇచ్చే సలహాలపై ఐపీఎల్ ఖరారు అనేది ఆధారపడి ఉందని బీసీసీఐ తెలిపింది. చైనా స్పాన్సర్ చిప్ విషయమై బీసీసీఐ దాటవేయడం తో.. వాటిని తప్పిస్తున్నారన్న ప్రచారం నిజమేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox