Breaking News

ఐపీఎల్ కంటే పిఎస్ఎల్ ఉత్తమం..: అక్రమ్

05 th Jun 2020, UTC
ఐపీఎల్ కంటే పిఎస్ఎల్ ఉత్తమం..: అక్రమ్
ప్రపంచ క్రికెట్ లీగ్స్ లలో ఇండియన్ ప్రైమ్ లీగ్ ఎంత ఉన్నతమైనదో చెప్పక్కర్లేదు. అన్నిటికన్నా టాప్ ప్లేస్ లో ఉంది ఐపీఎల్.. విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ లో ఆడటానికి ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటిది.. పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ మాత్రం తమ లీగ్ అయిన పీఎస్‌ఎల్‌ పై ప్రేమ కురిపిస్తున్నారు. ఓ వైపు ఐపీఎల్ తో పోల్చకూడదు అని చెబుతూ.. మరో వైపు తమదే గ్రేట్ అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇది తన అభిప్రాయం కాదని, కొంతమంది విదేశీ ఆటగాళ్లు తనతో చెప్పిన మాటనే చెబుతున్నానని అక్రమ్ చెప్పుకురావడం గమనార్హం.. 
      "గత కొన్నేళ్లుగా పీఎస్‌ఎల్‌ను సీరియస్‌గా గమనిస్తున్నా. దానిలో భాగంగానే చాలా మంది విదేశీ ఆటగాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకున్నా. ఐపీఎల్‌కు పీఎస్‌ఎల్‌కు ఉన్న తేడా ఏమిటి అని అడిగా. వారంత ఐపీఎల్‌లో నాణ్యమైన బౌలింగ్‌ లేదనడమే కాకుండా పీఎస్‌ఎల్‌లో ఒక క్వాలిటీ బౌలింగ్‌ ఉందన్నారు. ప్రత్యేకంగా బౌలింగ్‌ విషయంలో ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ ఎంతో ముందంజలో ఉందని వారు చెప్పారు" అని మాజీ క్రికెటర్‌ బాసిత్‌ ఆలీతో యూట్యూబ్‌ చాట్‌లో అక్రమ్‌ పేర్కొన్నాడు. 
     ఓ వైపు పొగుడుకుంటూనే... పిఎస్ఎల్ ను ఐపీఎల్ తో పోల్చలేమని మళ్ళీ తానె చెప్పాడు.."‘పీఎస్‌ఎల్‌ అనేది ఇప్పుడిప్పుడు వెలుగు చూస్తున్న లీగ్‌. ఐపీఎల్‌కు ఎప్పుడో ఒక గొప్ప వైభవం వచ్చేసింది. ఐపీఎల్‌ పుట్టి 12 ఏళ్లు అయ్యింది. పీఎస్‌ఎల్‌ అనేది ఇంకా ఐదేళ్ల బాలుడే. పీఎస్‌ఎల్‌కు అంకురార్పణ జరిగినప్పుడు ఇంత పెద్ద లీగ్‌ ఎలా నిర్వహిస్తారనుకున్నా. ఇప్పుడు ఆ లీగ్‌ వరల్డ్‌లో రెండో అతి పెద్ద టోర్నమెంట్‌గా ఉంది. ఐపీఎల్‌ తర్వాత స్థానం కచ్చితంగా పీఎస్‌ఎల్‌’" అంటూ అక్రమ్ చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్లుగా కరాచీ కింగ్స్‌కు అక్రమ్‌ సేవలందిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌లో 2016 వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా అక్రమ్‌ కొనసాగాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox