Breaking News

వందేళ్ల క్రికెటర్ కన్నుమూత..!

14 th Jun 2020, UTC
వందేళ్ల క్రికెటర్ కన్నుమూత..!

భారత తొలి తరం క్రికెటర్‌, చరిత్రకారుడు వసంత్‌ రాయ్‌జీ (100) వృద్ధాప్యం కారణంగా శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. ఈ ఏడాది 26న ఆయన వందవ పుట్టిన రోజు సందర్భంగా సచిన్‌, స్టీవ్‌ వా సమక్షం లో రాయ్‌జీ కేక్‌ను కట్‌ చేశారు. అలాగే ఇప్పటిదాకా ప్రపంచ క్రికెట్‌లోనే ఎక్కువకాలం జీవించిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌గానూ నిలిచారు.

1920 జనవరి 26న గుజరాత్‌లోని వడోదరలో జన్మించిన వసంత్‌.. 1939లో క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తరఫున అరంగేట్రం చేశారు. 1941లో తొలిసారిగా విజయ్‌ మర్చంట్‌ నేతృత్వంలో బాంబే జట్టు తరఫున ఆడారు. అలాగే 1950 వరకు సాగిన కెరీర్‌లో 9 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 277 పరుగులు సాధించారు. రంజీ ట్రోఫీలో బాంబేతోపాటు బరోడా తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అనుభవం ఉంది.

చార్టెడ్‌ అకౌంటెం ట్‌గా, క్రికెట్‌ చరిత్రకారుడిగా పేరు తెచ్చుకున్న రాయ్‌జీ  ఓ విధంగా భారత టెస్టు క్రికెట్‌ ప్రస్థానాన్ని ఆరంభం నుంచి ఇప్పటి దాకా కళ్లారా చూశారు. స్వదేశంలో టీమిండియా 1933లో తొలి టెస్టు ఆడిన సమయంలో అప్పటికి 13 ఏళ్ల వయస్సున్న అతను ఆ మ్యాచ్‌ను బాంబే జింఖానా మైదానంలో తిలకించారు.

వసంత్‌ రాయ్‌జీ  మృతిపై  బీసీసీఐ, ముంబై క్రికెట్‌ సంఘం తమ విచారాన్ని ప్రకటించింది. ఇటీవల రాయ్‌జీ వందో పుట్టినరోజు సందర్భంగా అతనితో కలిసి తీసుకున్న ఫొటోను సచిన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆరోజు పాతకాలపు క్రికెట్‌ విషయాలను ఎన్నింటినో అతని నోటి నుంచి విన్నామని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox