Breaking News

ఆఖరి రెండు టెస్ట్ లకు జట్టులో చేరిన ఉమేష్ యాదవ్

22 nd Feb 2021, UTC

ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్, ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ అయిన తరువాత, ఇంగ్లాండ్ తో జరిగే చివరి రెండు టెస్టులకు భారత టెస్ట్ జట్టులో చేరినట్లుభారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) సోమవారం తెలిపింది. ఆఖరి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు వేదిక అయిన అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియంలో ఫిబ్రవరి 21న ఫిట్‌నెస్ టెస్టుకు ఉమేష్ హాజరైనట్లు బిసిసిఐ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఉమేష్ చేరిక తరువాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి షార్దుల్ ఠాకూర్ జట్టు నుండి బయటకు వచ్చాడు.

టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఫిబ్రవరి 21 ఆదివారం మోటెరాలో ఫిట్నెస్ పరీక్ష కోసం హాజరయ్యాడు. అతను తన ఫిట్నెస్ పరీక్షను క్లియర్ చేసాడు మరియు కొనసాగుతున్న పేటిఎమ్ ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ యొక్క చివరి రెండు టెస్టులకు జట్టులో చేర్చబడ్డాడని బిసిసిఐ మీడియాకు విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది.

నాలుగు మ్యాచ్‌ల సిరీస్ లో 1-1తో వున్న ఇరు జట్లు పగటి-రాత్రి టెస్టులో తలపడతాయి, ఫిబ్రవరి 24 నుండి మోటెరాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఇది ప్రారంభమవుతుంది. సిరీస్ యొక్క ఆఖరి మ్యాచ్ కూడా మార్చి 4-8 నుండి అదే వేదిక వద్ద జరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox