Breaking News

క్రికెట్ కు ఉమర్ గుల్ గుడ్ బై

17 th Oct 2020, UTC
క్రికెట్ కు ఉమర్ గుల్ గుడ్ బై

ఇస్లామాబాద్‌ :రెండు దశాబ్దాలపాటు పాకిస్తాన్‌ పేస్ బౌలింగ్ లో కీలకంగా వ్యవహరించిన ఉమర్‌ గుల్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. పాక్ నేషనల్‌ టీ20 కప్‌లో శుక్రవారం రాత్రి బలూచిస్తాన్‌, సౌతర్న్‌ పంజాబ్‌ జట్ల మధ్య పోరు అనంతరం ఉమర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. క్రికెట్ లో్ని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అవుతున్నానని. 20 ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. కొత్త ఆటగాళ్లకు దారి ఇచ్చేందుకు, గొప్ప జీవితాన్నిచ్చిన క్రికెట్‌కు మరిన్ని సేవలు చేసేందుకే తాను వైదొలిగినట్టు స్పష్టం చేశాడు.

నా క్రికెట్‌ జీవితాన్ని చాలా ఎంజాయ్‌ చేశాను. క్రికెట్‌ జీవితంలో పోరాటాన్ని, విలువలను నేర్పింది. గౌరవాన్ని ఇచ్చింది. కెరీర్‌ ఎదుగులకు చాలా మంది మద్దతుగా నిలిచారు. గొప్పగొప్పవాళ్లతో పరిచయం మంచి అనుభవం. వాళ్లందరికీ కృతజ్ఞతలు. నా ఆటను ఆస్వాదించిన ప్రతి అభిమానికి ధన్యవాదాలు. వాళ్లే నాకు ప్రేరణనిచ్చారు. క్రికెట్‌ నుంచి పక్కకు తప్పుకోవడం కష్టంగానే ఉంది. నన్ను ఇంత ఉన్నత శిఖరాలకు చేర్చిన క్రికెట్‌ను, నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ ఉమర్ గుల్ ప్రకటించాడు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox