Breaking News

బుమ్రా వేసిన నో బాల్‌ మ్యాచ్ ను మార్చేసింది:భువనేశ్వర్ కుమార్

29 th Jun 2020, UTC

సుమారు మూడేళ్ల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ ఏకపక్షంగా ముగి సింది. పాక్ విధించిన భారీ లక్ష్యాన్ని చేధించే సమయంలో బ్యాట్స్ మన్ దారుణంగా విఫలమవడంతో భారత్ చిత్తుగా ఓడిపోయింది.  ఈ మ్యాచ్ పై  టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నో బాల్‌ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు

 పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఫకార్‌ జమాన్‌కు బుమ్రా వేసిన నో బాల్‌ మొత్తం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసిందని భువీ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌ ఆరంభంలోనే ఫకార్‌ ఇచ్చిన క్యాచ్‌ను ధోని అందుకున్నా అది నో బాల్‌ కావడం కొంపముంచిందన్నాడు.

 ఆ తర్వాత మ్యాచ్‌ మొత్తం వన్‌ సైడ్‌ వార్‌లా మారిపోవడంతో పాక్‌ టైటిల్‌ను గెలిచిందన్నాడు.  2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఏకపక్ష పోరులా మారిపోయింది. జట్టంతా సమష్టిగా విఫలం చెందడం ఒక ఎత్తు అయితే, బుమ్రా వేసిన నో బాల్‌ మరొక ఎత్తు

నో బాల్‌తో బతికి బయటపడ్డ ఫకార్‌ 114 పరుగులు చేసి పాక్‌ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ఆ తర్వాత మేము బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం. పాక్‌ 338 పరుగులు చేస్తే, మేము 158 పరుగులకే ఆలౌటై 180 పరుగుల తేడాతో భారీ ఓటమి చెందాం’ అని భువీ తెలిపాడు. అయితే ఓవరాల్‌గా గత కొన్నేళ్లుగా భారత ప్రదర్శన ఎంతో మెరుగైందనే విషయాన్ని భువీ తెలిపాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox