Breaking News

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్

02 nd Apr 2021, UTC

గత వారం తనకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు వెల్లడించిన సచిన్ టెండూల్కర్ శుక్రవారం వైద్య సలహా ప్రకారం ఆసుపత్రిలో చేరానని ట్వీట్ చేశారు. "కొద్ది రోజుల్లో" ఇంటికి తిరిగి రావాలని ఆశిస్తున్నానని సచిన్ తెలిపారు. "మీ కోరికలు మరియు ప్రార్థనలకు ధన్యవాదాలు. వైద్య సలహా ప్రకారం చాలా జాగ్రత్తలు తీసుకొని, నేను ఆసుపత్రిలో చేరాను. కొద్ది రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి మరియు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి" అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేసారు. 2011 ప్రపంచ కప్ విజయానికి 10 వ వార్షికోత్సవం సందర్భంగా  తన సహచరులకు అభినందనలు తెలిపారు. 

మార్చి 27న సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో తనకు కరోనా పాజిటివ్ అని వెల్లడించారు. "తేలికపాటి లక్షణాలు" చూపించిన తరువాత తాను పరీక్ష చేయించుకున్నానని మరియు ఇంట్లో క్వారంటైన్ లో వున్నానని తెలిపారు.

తన ఇంట్లో మిగతా వారందరూ నెగెటివ్ వచ్చినట్లు సచిన్  తెలిపారు. సచిన్ ఇటీవలే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి 20 టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. ఇండియా లెజెండ్స్ జట్టులోని మరో ముగ్గురు సభ్యులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ మరియు సుబ్రమణ్యం బద్రీనాథ్ లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox