Breaking News

సచిన్ తన కాలంలో క్రికెట్ ను శాసించాడు.. పాక్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ 

17 th Nov 2020, UTC

న్యూఢిల్లీ :అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయి 7 సంవత్సరాలు గడిచినా సచిన్ టెండూల్కర్ పై అభిమానులకు, ఇతర క్రికెటర్లకు గౌరవం తగ్గలేదు. పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ లిటిల్ మాస్టర్ సచిన్ తో కలిసి ఆడిన విషయం తెలిసిందే. దీనిపై అతను గ్లోఫాన్స్‌తో మాట్లాడుతూ సచిన్ తన కాలంలో క్రికెట్ ను శాసించాడని అన్నాడు. తన కున్న ప్రతిభతో సచిన్ ఆటపై ప్రభావం చూపడంలో విజయవంతమయ్యాడని కూడా ఆకిబ్ పేర్కొన్నాడు.

పాకిస్తాన్ తరపున 22 టెస్టులు మరియు 163 వన్డేల్లో పాల్గొన్న ఆకిబ్ ఒక వన్డే మ్చాచ్ లో 7/37 ప్రతిభను చూపడంతో వార్తల్లో కెక్కాడు. ఇది ఇండియా పాక్ ల మధ్య  జరిగిన మ్యాచ్ కావడం విశేషం. దీనితో భారత అభిమానులు అతడిని ద్వేషించారు. ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఆకిబ్ బదులిస్తూ మెరుగైన  సాంకేతికత లేని  ఆ సమయంలో  అంపైర్  నిర్ణయమే ఫైనల్ గా లెక్కించేవారని చెప్పాడు. ఆ మ్యాచ్ లో ఆకిబ్ తీసుకున్న 7 వికెట్లలో అతడికి హ్యాట్రిక్ రావడం గమనార్హం. , రవిశాస్త్రి, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ అతడి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా అవుటయ్యారు. 

అంతర్జాతీయ క్రికెటల్ో 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ .టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్  200 టెస్టులు 463 వన్డేలు, ఒక టి 20 ఐ ఆడి రిటైర్ అయ్యారు. టెస్టుల్లో 53.79 సగటుతో 15921 పరుగులు చేయగా వన్డేల్లో 44.83 సగటుతో 18426 పరుగులు చేశారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox