Royal Challengers Bengaluru vs Delhi Capitals: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ 24వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో ఉంది.
అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు భారీగా గెలిచినా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయగా.. బెంగళూరు ఆడిన నాలు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి ఒక్క మ్యాచ్‌లో ఓడింది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా జరగనుంది.