Breaking News

పంజాబ్ జోరుకి బ్రేక్ వేసిన రాజస్థాన్..!

31 st Oct 2020, UTC
పంజాబ్ జోరుకి బ్రేక్ వేసిన రాజస్థాన్..!

ఐపీఎల్ 2020 సీజన్‌లో నిన్న రాజస్థాన్ జట్టుకు, పంజాబ్ జట్టుకు మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఇరగదీసేసారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు రాజస్థాన్ జట్టు బ్రేక్ ఇచ్చింది. క్రిస్‌గేల్ (99: 63 బంతుల్లో 6x4, 8x6) గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడిపోయి పంజాబ్ మొదట బాటింగ్ చేసింది. పంజాబ్ టీం 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆ తరువాత బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇరగదీసారు.

బెన్‌స్టోక్స్ (50: 26 బంతుల్లో 6x4, 3x6), సంజు శాంసన్ (48: 25 బంతుల్లో 4x4, 3x6) బాగా దూకుడుగా ఆడారు. తొలుత ఎక్కువ స్కోర్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ 17.3 ఓవర్లలోనే 186/3 పరుగులతో చాలా తొందరగా విజయానికి చేరువ అయ్యారు. ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ కి ఇది  ఆరో గెలుపు. పంజాబ్ జట్టుకి ఇది ఏడవ ఓటమి. ఈ రెండు జట్లు చివరి మ్యాచ్ లో గెలిస్తే తప్ప ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేవు.  మరిన్ని క్రీడా వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox