Breaking News

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్

16 th Oct 2021, UTC

రాబోయే ఐసిసి టి 20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులవుతారు.  ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి ఆ పదవి నుంచి వైదొలగనున్నారు.బిసిసిఐ కార్యదర్శి జైషా  మరియు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ  ఇద్దరు కలిసి ద్రావిడ్ ను కోచ్ గా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాహుల్ ద్రవిడ్ 2016 లో భారత్ అండర్ -19 యొక్క ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. 2016 మరియు 2018 లో జరిగిన  ఐసిసి అండర్ -19 వరల్డ్ కప్‌ టోర్నమెంట్లలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రిషబ్ పంత్, అవేశ్ ఖాన్, పృథ్వీ షా, హనుమ విహారి, మరియు శుభమన్ గిల్ వంటి చాలా మంది ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్ ద్వారా వెలుగులోకి వచ్చారు.

రాహుల్ ద్రావిడ్  ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి హెడ్ గా వున్నారు.2023 వరల్డ్ కప్ వరకు భారత జట్టుకు కోచ్‌గా రాహుల్ అంగీకరించారు. మొదట దీనికి రాహుల్ అయిష్టంగానే ఉన్నప్పటికీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షా ఐపిఎల్ ఫైనల్ సందర్భంగా రాహుల్‌తో సమావేశమయ్యారు.వారు అతనిని ఒప్పించగలిగారు అని బిసిసిఐ  వర్గాలు తెలిపాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox