Breaking News

PV Sindhu: పివి సింధుకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

04 th Aug 2021, UTC

Hyderabad :భారత స్టార్ షట్లర్  పివి సింధు కు బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పీవీ సింధు కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి  శ్రీనివాసగౌడ్  మాట్లాడుతూ వరుసగా రెండు పతకాలు సాధించి సింధు దేశానికి తెలుగు జాతికి పేరు తెచ్చారని కొనియాడారు.

అందరి సహకారంతోనే ఒలంపిక్స్‌లో మెడల్ సాధించానని భారత స్టార్‌ షట్లర్‌  సింధు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు తీసుకురావటానికి కృషిచేస్తానని చెప్పారు. గచ్చిబౌలిలో ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మీడియా సహకారం కూడ తమకు వుందని ఆమె తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం కేసీఆర్ అభినందించిన విషయం తెలిసిందే. వరసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు సాధించడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox