Breaking News

సెమీఫైనల్ కు చేరిన సింధు

30 th Jul 2021, UTC
సెమీఫైనల్ కు చేరిన సింధు

 National : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒలింపిక్స్ లో పతకానికి చేరువయింది. శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన అకనే యమగుచితో వరుస సెట్లలో విజయం సాధించింది. 56 నిమషాలపాటు జరిగిన ఈ గేమ్ లోతొలి నుంచి దూకుడు ప్రదర్శించిన సింధు 21-13, 22-20తో యమగుచిని ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది.

ఆమె సెమీస్ లో థాయ్‌లాండ్‌కు చెందిన రాట్చనోక్ ఇంతనోన్ మరియు చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు యింగ్ మధ్య జరిగే మరో క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. పీవీ సింధు సెమీస్ చేరడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తనకన్నా మెరుగైన సీడింగ్ కలిగిన జపాన్ షట్లర్ అకానే యమగూచిని సింధు ఓడించడం పట్ల ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఒత్తిడిని జయించి విజయం సాధించిందని అన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు చాలా బాగా ఆడిందని పేర్కొన్నారు.

సింధు విజయం సమష్టి కృషికి నిదర్శనమని, కోచ్ సహా అందరి పాత్ర ఉందని  తెలిపారు. సింధు దేశానికి మంచిపేరు తెస్తున్నందుకు ఓ తండ్రిగా ఆనందపడుతున్నానని పీవీ రమణ తన మనోభావాలను పంచుకున్నారు. సెమీస్ లో కూడా ఇదే ఆటతీరుతో విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox