Breaking News

Tokyo Olympics: సెమీఫైనల్లో ఓడిన సింధు

01 st Aug 2021, UTC
Tokyo Olympics: సెమీఫైనల్లో ఓడిన సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో ఓడింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం చైనీస్ తైపీ తై జు యింగ్‌తో సెమీస్‌లో తలపడిన పీవీ సింధు 18-21, 11-21 తేడాతో వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూసింది. పీవీ సింధు, తై జుయింగ్ ఇప్పటి వరకూ 19 సార్లు తలపడగా ఇందులో ఏకంగా 14 సార్లు పీవీ సింధుని తైజు ఓడించడం గమనార్హం. కాంస్య పతకం కోసం చైనా షట్లర్ హి బింగ్జియావోతో పీవీ సింధు ఆదివారం సాయంత్రం తలపడనుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన పీవీ సింధు రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

సెమీస్ మ్యాచ్‌లో తై జు యింగ్ బోణి కొట్టగా నిమిషాల్లోనే సింధు 5-2తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆ తర్వాత తై జు దూకుడు పెంచినా పీవీ సింధు మాత్రం వ్యూహాత్మకంగా ఆడుతూ కనిపించింది. ఈ క్రమంలో 11-8, 16-15తో లీడ్‌లో ఉండి సెట్‌ని చేజిక్కించుకునేలా కనిపించిన సింధు. ఆఖర్లో అనూహ్యంగా తడబడింది. దాంతో పుంజుకున్న తై జు 21-18తో సెట్‌ని గెలిచేసింది.

రెండో సెట్‌లో అనవసర తప్పిదాలతో పీవీ సింధు వరుసగా తై జుకి మధ్యలో పాయింట్లు ఇచ్చేసినట్లు కనిపించింది. తైజు 11-7 నుంచి సెట్‌ని ఒక్కసారిగా 16-8కి తీసుకెళ్లింది. దాంతోసింధుపై కూడా ఒత్తిడి పెరిగిపోగా తై జు షటిల్‌ని తెలివిగా  ఆడుతూ మ్యాచ్‌ని ముగించేసింది.

ఒలింపిక్స్‌లో వరుసగా రెండు సార్లు సెమీస్ చేరిన భారత తొలి బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఇప్పటికే అరుదైన ఘనతని సొంతం చేసుకున్న సింధు. 2016 రియో ఒలింపిక్స్, 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌‌లో తై జు యింగ్‌ని ఓడించింది. కానీ, టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం సింధుకి నిరాశ తప్పలేదు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox