Breaking News

PV Sindhu : పివి సింధు యువ అథ్లెట్లకి స్పూర్తి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

04 th Aug 2021, UTC

National : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన స్టార్ షట్లర్ పివి సింధు ఎంతోమంది యువ అథ్లెట్లకి స్ఫూర్తిగా నిలిచారని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసల వర్షం కురిపించారు. టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న పివిసింధు‌ను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, నిశిత్ ప్రామాణిక్‌లు ఆమెని సన్మానించారు. 

ఈ సందర్బంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశం తరఫున ఆడాలని కలలు కనే ప్రతి ఒక్క అథ్లెట్ ఊహల్లో పీవీ సింధు ఉంటుంది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఆమె కచ్చితంగా దిగ్గజ ఒలింపియన్లలో సింధు ఉంటుంది. ఆమె దేశానికి ఐకాన్ అని ప్రశంసించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.

ఢిల్లీ విమానాశ్రయంలో పీవీ సింధుకి భారత బ్యాడ్మింటన్ సంఘం, స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్వాగతం పలికారు. సింధు రాకతో విమానాశ్రయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox