Breaking News

ఆక్సిజన్ కొనుగోలుకు 50 వేల డాలర్ల విరాళమిచ్చిన పాట్ కమిన్స్

27 th Apr 2021, UTC

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఆక్సిజన్  కొనుగోలుకు పీఎం కేర్స్ ఫండ్‌కు 50 వేల డాలర్ల విరాళం ప్రకటించాడు. తాను విరాళం ప్రకటించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కమిన్స్.. దేశంలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తున్న  నేపథ్యంలో ఇతర టాప్ ప్లేయర్లు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. 

ఆటగాళ్లగా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని మిలియన్ల మందిని చేరుకునే అవకాశం ఉందని, దానిని మంచి కోసం ఉపయోగించుకుందామని కోరాడు.తాను చేసిందేమీ పెద్ద సాయం కాకపోయినా కొంతమందికైనా అది ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. తాను తన సహచరులను కూడా ఈ విషయంలో ప్రోత్సహిస్తున్నాని, తనవంతు సాయాన్ని 50 వేల డాలర్ల విరాళంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్టున్నట్టు కమిన్స్ చెప్పాడు. 

కమిన్స్ ఔదార్యంపై సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. కమిన్స్‌కు శాల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు భారత ప్లేయర్లు మేలుకోవాలని చురకలు అంటిస్తున్నారు. భారత ఆటగాళ్లు తమ డబ్బులను గాళ్ ఫ్రెండ్స్‌కు బహుమతులు కొనడానికి మాత్రమే ఉపయోగిస్తారని కామెంట్ చేస్తున్నారు. అందుకే పాట్ కమిన్స్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అంటూ కొనియాడుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox