Site icon Prime9

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. తొలి స్థానానికి దూసుకెళ్లిన పాకిస్తాన్

pakistan

pakistan

ICC ODI Rankings: ప్రపంచ్ కప్ కు ముందు పాకిస్థాన్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెుదటి స్థానానికి వెళ్లింది. మంచి ఫామ్ లో ఉన్న ఆ జట్టు న్యూజిలాండ్ పై వరుస విజయాలు సాధించి తొలి స్థానానికి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ తో ఐదు వన్డేల సిరీస్ లో వరుసగా నాలుగింట గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉంది.

తొలి స్థానానికి పాకిస్థాన్.. (ICC ODI Rankings)

ప్రపంచ్ కప్ కు ముందు పాకిస్థాన్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెుదటి స్థానానికి వెళ్లింది. మంచి ఫామ్ లో ఉన్న ఆ జట్టు న్యూజిలాండ్ పై వరుస విజయాలు సాధించి తొలి స్థానానికి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ తో ఐదు వన్డేల సిరీస్ లో వరుసగా నాలుగింట గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉంది.

మరో ఐదు నెలల్లో భారత్ వేదికగా జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు ముందే పాకిస్తాన్ ఫుల్ జోష్ లో ఉంది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ టీమ్.. వన్డేలలో ఇప్పుడు వరల్డ్ నెంబర్ వన్ టీమ్ గా నిలిచింది. స్వదేశంలో న్యూజిలాండ్ ను వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడించింది.

తాజా ర్యాంకులతో పోలీస్తే.. పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా, భారత్ కు కూడా 113 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. పాక్ కు 113.483 రేటింగ్ పాయింట్లు ఉండగా ఆసీస్ కు 113.286, భారత్ కు 112.638 పాయింట్లు ఉన్నాయి.

సెంచరీతో చెలరేగిన బాబర్‌

నాలుగో వన్డేలో బాబర్ ఆజామ్ సెంచరీతో చేలరేగాడు. ఈ మ్యాచులో 107 పరుగులతో పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. సల్మాన్‌ అర్థ శతకంతో రాణించాడు. పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో బాబర్ ఆజామ్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు.

Exit mobile version
Skip to toolbar