Breaking News

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై

16 th Aug 2020, UTC
అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై

క్రికెట్:  జార్ఖండ్ డైనమైట్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. 'కెరీర్‌ అసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియో‌ను షేర్ చేశాడు. భారత్‌కు టీ20, వన్డే, వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయిన మహేంద్రుడు మరి కొంతకాలం క్రికెట్లో కొనసాగుతాడనే అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు షాక్ కు లోనయ్యారు. ధోని రిటైర్మెంట్ ఇంత సింపుల్ గా చడీ చప్పుడూ లేకుండా జరగడం వారికి రుచించడం లేదు.  

టీం ఇండియా కెప్టెన్ గా చిరస్మరణీయ విజయాలు సాధించిన ధోనీ  కెరీర్ డకౌట్ తో ప్రారంభమయింది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ జర్నీ గోల్డెన్ డకౌట్‌తో మొదలైనా, తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 17266 రన్స్ చేసిన 38 ఏళ్ల మహీఇప్పటిదాకా 350 వన్డేలు, 90 టెస్ట్‌లు, 98 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 829 ఔట్లలో పాలుపంచుకొని వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఇండియా బెస్ట్‌గా వెలుగొందాడు.
 
ఎంత ఒత్తిడిలోనయినా కూల్‌గా ఉండే ధోనీ ని కెప్టెన్ కూల్ అని కూడ పిలుస్తారు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో ప్రపంచ కప్, 2013లో చాంపియన్ ట్రోఫీ కూడా సాధించి ఐసీసీ మూడు మేజర్ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. టెస్టులు, వన్డేల్లో భారత్‌కు నంబర్ వన్ ర్యాంక్ సాధించిపెట్టాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ కెప్టెన్సీలో మూడుసార్లు టైటిల్ గెలుపొందింది. 
 
త్వరలో జరగబోయే ఐపీఎల్ టోర్నీలకు సిద్దమవుతున్న ధోనీ ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని క్రీడాభిమానులు ఊహించలేదు. ధోనీ అంటే 2011 ప్రపంచ కప్ ఫైనల్లో మలింగ బౌలింగ్ లో  సిక్సర్ కొట్టి అతను మ్యాచ్ ను ముగించిన దృశ్యం అభిమానుల జ్జాపకాల్లో  చిరస్దాయిగా నిలిచి పోతుంది.  చదవండి మరిన్ని క్రీడా వార్తలు
 
Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired

A post shared by M S Dhoni (@mahi7781) on

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox