Breaking News

లవ్లీనా ఇక డీఎస్పీ...

13 th Jan 2022, UTC
లవ్లీనా ఇక డీఎస్పీ...

lovelyna: భారతీయ ఔత్సాహిక మహిళా బాక్సర్. బోర్గోహైన్ 2 అక్టోబర్ 1997 న జన్మించింది. ఆమె స్వస్థలం అస్సాంలోని గోలఘాట్ జిల్లా.  ఆమె తండ్రి 'టికెన్' తల్లి 'మామోని బోర్గోహైన్'. ఆమె తండ్రి టికెన్ సాధారణ వ్యాపారి. తన బిడ్డ కలల్ని నెరవేర్చేందుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆమె కవల సోదరీమణులైన లిచా - లిమా కూడా కిక్‌ బాక్సింగ్‌లో జాతీయ స్థాయిలో పోటీ పడింది, కానీ వాళ్ల కెరియర్ అక్కడితోనే ఆగిపోయింది. బోర్గోహైన్ కూడా కిక్‌బాక్సర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించింది.అస్సాం నుండి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి మహిళగా, శివ థాపా తరువాత దేశానికి ప్రాతినిధ్యం వహించిన రెండవ బాక్సర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ విభాగంలో పాల్గొనడానికి ఆమె ఎంపికవడం ద్వారా బోర్గోహైన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ బ్రేక్ వచ్చింది. కానీ క్వార్టర్ ఫైనల్లో ఆమె బ్రిటన్‌కు చెందిన శాండీ ర్యాన్ చేతిలో ఓటమి పాలయ్యింది.

2020 మార్చిలో, 2020 ఆసియా & ఓషియానియా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మాఫ్టునాఖోన్ మెలీవాపై 5-0 తేడాతో విజయం సాధించి 69 కిలోల విభాగంలో ఒలింపిక్ బెర్త్ సాధించారు లౌవ్లీ. దీంతో అస్సాం నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది.2020 లో అర్జున అవార్డు అందుకున్న ఆమె అస్సాం నుండి ఆ అవార్డు అందుకున్న ఆరవ వ్యక్తిగా నిలిచింది.టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహెన్‌ అస్సాంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సీఎం హిమంత బిశ్వశర్మ ఆమెకు అందజేసి అభినందించారు.

మరిన్ని  క్రీడా వార్తలు చదవండి  (జడ్డు.. ఇన్‌స్టా పోస్ట్..)

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox