Breaking News

కోల్ కతా టీం యాజమాన్యం తప్పు చేసింది..!

17 th Oct 2020, UTC
కోల్ కతా టీం యాజమాన్యం తప్పు చేసింది..!

ఐపీఎల్ సీజన్ 2020 కోల్ కతా నైట్ రైడర్స్ టీం కెప్టెన్ గా దినేష్ కార్తీక్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే టీం యాజమాన్యం కూడా ఇందుకు ఒప్పుకుని అతని స్థానంలో ఇయాన్ మోర్గాన్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ టీంకు గత సీజన్లలో టైటిల్స్ అందించిన మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్. కోల్ కతా టీం యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దినేష్ కార్తీక్ ఈ జట్టును ఏడూ మ్యాచుల్లో ముందుండి నడిపించాడు. అందులో అతను 4 గెలిపించి 3 ఓడిపోయాడు.

అయితే బాటింగ్ పై దృష్టి పెట్టడానికి అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ, ఇలా సీజన్ మధ్యలో కెప్టెన్ ను మార్చడం సరికాదని గౌతమ్ పేర్కొన్నారు. "మోర్గాన్ కెప్టెన్ గా జట్టును మార్చగలడని నేను అనుకోను. ఒకవేళ అతను టోర్నమెంట్ ప్రారంభం నుండి కెప్టెన్‌గా ఉంటే మార్చగలిగేవాడు. కానీ టోర్నమెంట్ మధ్య లో కెప్టెన్ ని మార్చి అతనికి టీం నడిపించాలంటే కష్టం అవుతుంది. " అని గంభీర్ పేర్కొన్నాడు. నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా టీం ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో మోర్గాన్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌ లో పరాజయం పాలయ్యాడు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox