Breaking News

కెకెఆర్ x చెన్నై చివరి బంతితో విజయం సాధించిన చెన్నై

27 th Sep 2021, UTC

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబిలో  ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ రసవత్తరంగా  జరిగింది.   చివరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్ లో చివరకు  చెన్నై విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా చెన్నై ఓపెనర్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌ శుభారంభం అందించగా చివరిలో జడేజా మెరుపులు మెరిపించాడు.

వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో మొత్తం 8 బంతులు ఎదుర్కొని 22 పరుగులు చేసాడు. ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి సునిల్‌ నరైన్‌ జడేజాను అవుట్‌ అవడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. దీరితో  క్రీజులోకి వచ్చిన దీపక్‌ చహర్‌  ఒక పరుగు చేయడంతో  చెన్నై విజయం ఖరారయింది. మొత్తంగా చెన్నై 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.మ్యాచ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox