Breaking News

ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కడప కుర్రాడు..!

20 th Feb 2021, UTC

కడప జిల్లా రాయచోటికి చెందిన హరీష్ శంకర్ రెడ్డి ఐపీఎల్ కు ఆడనున్నారు. అతను సీఎస్కె జట్టుకు ఎంపికయ్యాడు. బౌలింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరచడం తో అతడిని సిఎస్కె యాజమాన్యం ఇరవై లక్షలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ రెడ్డి  ఆంధ్ర రంజీ జట్టు లో ఉన్నాడు. రాయచోటి ప్రాంతం లో చిన్నమండెం మండలం నాగూరివాండ్లపల్లె గ్రామం లో వీరి కుటుంబం నివాసం ఉంటోంది. రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవిలు ఇతని తల్లి తండ్రులు. వీరిది వ్యవసాయం పై ఆధారపడి కుటుంబం. పెద్ద కొడుకు బ్రతుకుదెరువు కోసం కువైట్ లో జీవిస్తున్నాడు.

వీరికి హరిశంకర్ రెడ్డి రెండవ సంతానం. డిగ్రీ వరకు చదువుకున్నాడు. బౌలింగ్ లో హరీష్ శంకర్ కు మంచి ప్రతిభ ఉంది. 2016లో రాష్ట్ర అండర్-19 జట్టుకు హరీష్ శంకర్ ఎంపికయ్యారు. 2018 నుంచి ఆంధ్ర రంజీ జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్ కు జరిగిన మినీ వేలంపాటలో  సిఎస్కె యాజమాన్యం హరీష్ శంకర్ ను ఎంపిక చేసుకుంది. 

హరీష్ శంకర్ ఐపీఎల్ కు ఎంపిక కావడం తో అతని పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ తండ్రి రామచంద్రన్ "హరీష్ కు క్రికెట్ అంటే ప్రాణమని, చిన్నప్పుడు క్లాసులు వదిలేసి మరీ ఎక్కడ టోర్నీ జరుగుతుంటే అక్కడకి వెళ్లేవాడని, దీనితో అతని కెరీర్ పై మాకు భయం ఉండేదని" చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు హరీష్ ను చూస్తుంటే గర్వం గా ఉందన్నారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా హరీష్ ను అభినందించారు. ఇలానే ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, టీం ఇండియా జట్టుకు కూడా ఆడాలని ఆకాంక్షించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox