Breaking News

సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్..!

24 th Jul 2020, UTC
సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్..!
 
క్రికెట్‌ ప్రియులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నిర్వహణకు సంబంధించి పాటిల్‌ పలు కీలక విషయాలను వెల్లడించారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్   ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టోర్నీలో మొత్తం 8 టీంలు లీగ్‌ బరిలో నిలుస్తాయని  తెలిపారు. ‘కరేబియన్‌లీగ్‌ సెప్టెంబర్‌ 10 న, ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ అదే నెల 15న ముగుస్తాయని తెలిపారు. 
 
ఈ మూడు దేశాల ఆటగాళ్లు వెసులుబాటుకు దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’ అని పాటిల్‌ తెలిపారు. దీనిపై బీసీసీఐ గవర్నర్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మొత్తం 51 రోజుల పాటు లీగ్‌ను నిర్వహించే విధంగా షెడ్యూల్‌ను తయారు చేస్తామని తెలిపారు.
 
 టీ-20 ప్రపంచ్‌ కప్‌ వాయిదా పడటంతో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ  అనుకున్నప్పటికీ భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో విదేశాల్లో లీగ్‌ను నిర్వహించాలని భావించింది. దీనిలో భాగంగానే లీగ్‌ నిర్వహణకు యూఏఈ అనువైన ప్రదేశంగా గుర్తించింది. 
 
 కరోనా రణంగా ఆస్ట్రేలియా వేదికగా సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కావాల్సిన టీ-20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఇటీవల అధికారికంగా  విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించకపోతే రూ. 4వేల కోట్ల వరకు నష్టం వస్తుందని  బీసీసీఐ.. తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox