Breaking News

భారత్ లోనే ఐపిఎల్ 2022.. బిసిసిఐ కార్యదర్శి జే షా

21 st Nov 2021, UTC

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 భారతదేశంలో జరుగుతుందని  బిసిసిఐ కార్యదర్శి  జే షా శనివారం ధృవీకరించారు.  చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో ఐపీఎల్ విజయాన్ని పురస్కరించుకుని చెన్నైలో జరిగిన “ది ఛాంపియన్స్ కాల్” కార్యక్రమానికి షా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పీఎల్ 15వ సీజన్ భారత్‌లో జరగనుంది.  కొత్త జట్లు- అహ్మదాబాద్ మరియు లక్నో పోటీలో చేరడం వల్ల ఇది మరింత ఉత్సాహంగా ఉంటుందని  అన్నారు.

చెపాక్‌లో  చెన్నై సూపర్ కింగ్స్  ఆడటం కోసం మీరంతా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. సరే, క్షణం ఎంతో దూరంలో లేదు. రెండు కొత్త జట్లు చేరడంతో ఇది మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందని షా అన్నారు. సివిసి క క్యాపిటల్ అహ్మదాబాద్ కోసం రూ. 5,625 కోట్లకు బిడ్‌ను గెలుచుకుంది, అయితే  ఆర్ పి -సంజీవ్ గోయెంకా గ్రూప్ లక్నో ఫ్రాంచైజీని రూ. 7,0090 కోట్లకు దక్కించుకుంది. వేలంపాట తర్వాత ఫార్మాలిటీలను బిడ్డర్లు పూర్తి చేసిన తర్వాత కొత్త ఫ్రాంచైజీలు 2022 సీజన్ నుండి  ఐపిఎల్ లో పాల్గొంటాయి.

చెన్నై లో నాచివరి టి 20 మ్యాచ్ ఆడతాను.. ధోని

చెన్నై సూపర్ కింగ్స్ సారథి, ఎంఎస్ ధోని  చెన్నైలోతన చివరి టి 20 మ్యాచ్ ఆడాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు.  చెన్నైలో ఆడటం ద్వారా దేశీయ సర్క్యూట్‌లో చిన్నదైన ఫార్మాట్‌లో ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు.నేను ఎప్పుడూ నా క్రికెట్‌ను ప్లాన్ చేసుకుంటాను. నేను రాంచీలో  నా చివరి వన్డే మ్యాచ్ ఆడాను.  రాంచీ నా స్వస్థలం. కాబట్టి, నా చివరి టీ20 చెన్నైలో జరుగుతుందని ఆశిస్తున్నాను. అది వచ్చే సంవత్సరమో లేక 5 సంవత్సరాలలోనో, మనకు నిజంగా తెలియదని ధోనీ వ్యాఖ్యానించాడు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox