Breaking News

సురేష్ రైనా ప్లేస్ లో అంబటి రాయుడు..?

12 th Sep 2020, UTC
సురేష్ రైనా ప్లేస్ లో అంబటి రాయుడు..?

చెన్నై :ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఐపీఎల్ ఎట్టకేలకు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపధ్యంలో సి ఎస్ కె కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారు కోలుకున్నారని సంతోషపడేలోపు సురేష్ రైనా ఆటనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వ్యక్తి గత కారణాలతో మరో ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సీఎస్ కే ఆటగాళ్లను వెతికే పనిలో పడింది. సురేశ్ రైనా స్థానాన్ని తెలుగు తేజం అంబటి రాయుడుతో భర్తీ చేయాలని న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టయిరిస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తోలి రెండు స్థానాల్లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నారు. అయితే, మూడవ స్థానంలో పంచ్ హిట్టర్‌గా గయక్వాడ్ రుతురాజ్‌ని ఆడించాలని కూడా సీఎస్ కె భావించవచ్చని స్టయిరిస్ అభిప్రాయపడ్డారు. రవీంద్ర జడేజాను కూడా ఆస్థానంలో ఆడించే అవకాశాలున్నాయన్నారు. అయినప్పటికీ, 3వ స్థానానికి అంబటిరాయుడిని ఎంపిక చేస్తేనే బాగుంటుందని స్కాట్ వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని అన్నారు. ఈ ఏడాది ఆలస్యంగా మొదలైన ఐపీఎల్ పోటీలు సెప్టెంబర్ 19న మొదలై, నవంబర్ 10న ముగియనున్న సంగతి తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox