Breaking News

కోల్ కతాటీం కెప్టెన్ మారిన రాత మారలేదు..!

17 th Oct 2020, UTC

అబుదాబి :ఐపీఎల్ సీజన్ లో నిన్న కోల్ కతా నైట్‌రైడర్స్ కు ముంబై ఇండియన్స్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా చిత్తుగా ఓడిపోయింది. ఆ టీం కెప్టెన్ మారినప్పటికీ ఓటమి వారిని వీడలేదు. వరుసగా రెండవసారి ముంబై ఇండియన్స్ చేతిలో కోల్ కతా టీం ఓడిపోయింది. అబుదాబి వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో పాట్ కమిన్స్ (53 నాటౌట్: 36 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీ బాదేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి తొలుత బాటింగ్ చేపట్టారు.  5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేశారు.
 
ఆ తరువాత బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ చెలరేగిపోయారు. ఓపెనర్ డికాక్ (78 నాటౌట్: 44 బంతుల్లో 9x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్  ఇచ్చాడు. దీనితో ముంబై టీంకి స్కోర్ చేయడం సులువు అయిపొయింది. 16.5 ఓవర్లలోనే 149/2తో ముంబై టీం విజయ తీరం చేరిపోయింది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ముంబై టీంకి ఇది ఆరో గెలుపు. దీనితో పట్టికలో ముంబై టీం అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్ కతా నైట్ రైడర్స్ కి ఇది నాలుగో ఓటమి. కోల్ కతా ఇపుడు పట్టికలో నాలుగవ స్థానంలో ఉంది. ప్రస్తుతం కోల్ కతా టీంకి ఇయాన్ మోర్గాన్ ను కెప్టెన్ గా ఉంచిన సంగతి తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox