Breaking News

ఈ సీజన్‌ ఐపీఎల్‌లో స్పిన్నర్లదే కీలక పాత్ర .. రమీజ్ రాజా

11 th Sep 2020, UTC

యూఏఈ వేదికగా జరుగనున్న ఈ సీజన్‌ ఐపీఎల్‌లో స్పిన్నర్లదే కీలక పాత్ర అని పాకిస్తాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌, కామెంటేటర్‌ రమీజ్‌ రాజా అన్నాడు. క్రిక్‌ కాస్ట్‌ నిర్వహించిన యూట్యూబ్‌ షోలో రమీజ్ మాట్లాడుతూ ముంబై ఇండియన్స్‌ ఘనవిజయాల్లో ఇప్పటివరకూ ముఖ్యపాత్ర పోషిస్తున్నహార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌ వంటి హార్డ్‌ హిట్టర్లకు కష్టాలు తప్పవన్నాడు.
 
యూఏఈలో బ్యాటింగ్‌ కంటే స్పిన్‌కే ఎక్కువ అనుకూలమన్నాడు. హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌ ముంబై ఇండియన్స్‌ ఘనవిజయాల్లో ఇప్పటివరకూ ముఖ్యపాత్ర పోషిస్తూ వస్తున్నప్పటికీ ఈసారి మాత్రం స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుంటారన్నాడు. ఈ సీజన్‌లో ఎవరితై స్పిన్‌ విభాగంలో బలంగా ఉంటారో ఆయా జట్లకే విజయావకాశాలు ఎక్కువ.ఇక్కడ ఫాస్ట్‌ బౌలింగ్‌కు కూడా పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇక్కడ మనం భిన్నమైన ఆటను చూడటం ఖాయంఅని రమీజ్‌ రాజా  తెలిపాడు. ఈనెల 19వ తేదీ నుంచి ఐపీఎల్‌ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కిం‍గ్స్‌ జట్ల మధ్య జరుగనుంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox