Breaking News

టీ 20 వరల్డ్ కప్ కు ఇండియా టీమ్

11 th Sep 2021, UTC
 టీ 20 వరల్డ్ కప్ కు  ఇండియా టీమ్

 బీసీసీఐ  సెలెక్షన్ కమిటీ బుధవారం టీ 20 వరల్డ్ కప్ 2021 కోసం  ఆడే  సభ్యుల  బృందాన్ని  ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో, భారత క్రికెట్ జట్టులో కొన్ని తాజా ముఖాలు ఉన్నాయి. చేతన్ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ముంబైలోని ప్రధాన కార్యాలయంలో సమావేశమై మాంచెస్టర్‌లో కెప్టెన్ కోహ్లీతో పాటు లండన్‌లో కోచ్ రవిశాస్త్రితో  కూడ  సంప్రదించి  పేర్లను ఖరారు చేసింది.

 బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షా (సెలక్షన్ కమిటీ కన్వీనర్) కూడా కమిటీ అత్యంత ముఖ్యమైన ఎంపికలో భాగం.కేఎల్ రాహుల్ మరియు రోహిత్ శర్మ ఇద్దరు  ఓపెనర్లు.  సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్  జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ స్టాండ్‌బై ప్లేయర్‌గా చేర్చబడ్డారు.స్పిన్ విభాగంలో, యుజ్వేంద్ర చాహల్ మరియు కుల్దీప్ యాదవ్‌లను పక్కనపెట్టారు. అయితే  రవిచంద్రన్ అశ్విన్  టీం కు తిరిగి వచ్చాడు.

 ప్రధాన పేసర్లగా  జస్ప్రీత్ బుమ్రా మరియు భువనేశ్వర్ కుమార్ వుండగా  దీపక్ చాహర్ మరియు శార్దూల్ ఠాకూర్ స్టాండ్‌ బైగా చేర్చబడ్డారు.భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్ ),  కెఎల్  రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి , జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.స్టాండ్ బై ప్లేయర్స్ - శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.

 కోవిడ్ -19 ప్రోటోకాల్‌ ప్రకారంచాలా జట్లు 15 మంది సభ్యుల బృందాలను ప్రకటించాయి. కోవిడ్ -19 మహమ్మారి నేపధ్యంలో30 మంది బృందానికి ఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఏదైనా జట్టులో 30 మంది సభ్యుల కంటే ఎక్కువ  మంది ఉండవచ్చు కానీ అదనపు ఖర్చును ఆ దేశ క్రికెట్ బోర్డు భరించాల్సి ఉంటుంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox