Breaking News

తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం

19 th Jul 2021, UTC
తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం

కొలంబో :శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో  శ్రీలంకపై గెలిచింది. భారత బ్యాటింగ్‌లో శిఖర్‌ ధవన్‌, ఇషాన్‌ కిషాన్‌, పృధ్వి షా రాణించారు. చివర్లో సూర్య కూమార్‌ యాదవ్‌ మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ విజయతీరాలకు చేరుకుంది. దీనితో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ నిలిచింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌లో కరుణరత్నే 43 నాటౌట్‌, శనక (39), అసలంక(38) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్‌లో కుల్దీప్‌, చాహల్‌, చాహర్‌కు చెరో రెండు వికెట్లు, హార్దిక్‌, కృణాల్‌కు చెరో వికెట్   పడగొట్టారు.

బ్యాటింగ్‌లోకి దిగిన టీమిండియా లక్ష్యాన్ని 13 ఓవర్లు మిగిలి ఉండగానే విజయవంతంగా చేధించింది. భారత బ్యాటింగ్‌లో శిఖర్‌ ధవన్‌ 86, ఇషాన్ కిషన్ 59, పృథ్వీ షా 43, సూర్య కుమార్‌ యాదవ్‌ 31 పరుగులు చేసారు. తొలి వన్డేలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా పృథ్వీ షా నిలిచాడు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox