Breaking News

ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌ షెడ్యూల్ ఖాయం..!

28 th Oct 2020, UTC

క్రికెట్ :ప్రస్తుతం దుబాయి వేదికగా ఐపీఎల్ సీజన్ 2020 జరుగుతున్న సంగతి విదితమే. అయితే ఐపీఎల్ ముగిసిన తరువాత భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లనుంది. ఈ పర్యటన డిసెంబర్ 3న ప్రారంభం కానుందని సమాచారం. కాగా ఇందులో భాగంగా భారత టీం భారత జట్టు మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది. 

ఇటీవలే ఆస్ట్రేలియా టూర్ కి సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వన్డే, టీ-20 సిరీస్ లతో పాటు టెస్ట్ సీరీస్ కూడా జరగబోతోంది.నవంబర్ 27 న తొలి వన్డే జరగనుందని సమాచారం. రెండో వన్డే నవంబర్ 29 సిడ్నీలో, మూడో వన్డే డిసెంబర్ 2 న మనుక ఓవెల్ జరుగుతాయని సమాచారం. అదే వేదిక మీద తొలి టీ-20 డిసెంబర్ 4 న జరుగుతుంది. రెండో టీ-20 డిసెంబర్ 6 న,మూడో టీ-20 డిసెంబర్ 8 న సిడ్నీ వేదికగా జరుగుతాయి. అలాగే టెస్ట్ మ్యాచ్ లు కూడా డిసెంబర్ డిసెంబర్ 17 నుంచి జనవరి పందొమ్మిదవ తేదీ వరకు జరగనున్నాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు డే అండ్ నైట్ గా  జరగనుంది. ఆ తరువాత రెండో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు, జనవరి 7 నుంచి 11 వరకు మూడవ టెస్ట్ జరుగుతాయి. జనవరి 15 నుంచి 19 వరకు  నాలుగవ టెస్ట్ జరుగుతుంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox