Last Updated:

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ప్రమాదకర బౌలర్లు వీరే.. ఐసీసీ లిస్ట్ రిలీజ్

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే బౌలర్లను డిసైడ్ చేసింది. ఒక్కో జట్టులో అత్యంత ప్రమాదకరమైన స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేసింది. ఈ మెగా టోర్నీలో 16 జట్ల తలపడనుండగా.. ఒక్కో జట్టు నుంచి ఇద్దరు స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేస్తూ ఒక జాబితా విడుదల చేసింది. మరి వారెవరో చూసెయ్యండి.

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ప్రమాదకర బౌలర్లు వీరే.. ఐసీసీ లిస్ట్ రిలీజ్

T20 World Cup: 2023లో వన్డే ప్రపంచకప్ ఉండగా మరి కొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. కాగా ఈ ఫార్మాట్‌లో వికెట్లు తీసే బౌలర్లకు మంచి క్రేజ్ ఉంటుంది. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వరుసగా రెండు వికెట్లు పడ్డాయంటే చాలు మ్యాచ్ అంతా తారుమారు అవుతుంది. విజేత ఎవరో చెప్పడం కష్టమవుతుంది. ఇంక ఈ విషయం ఆధారంగానే అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే బౌలర్లను డిసైడ్ చేసింది. ఒక్కో జట్టులో అత్యంత ప్రమాదకరమైన స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేసింది. ఈ మెగా టోర్నీలో 16 జట్ల తలపడనుండగా.. ఒక్కో జట్టు నుంచి ఇద్దరు స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేస్తూ ఒక జాబితా విడుదల చేసింది.

1. అఫ్ఘానిస్తాన్
రషీద్ ఖాన్
ముజీబ్ ఉర్ రెహ్మాన్

2. భారత్
భువనేశ్వర్ కుమార్
యుజ్వేంద్ర చాహల్

3. సౌతాఫ్రికా
లుంగి ఎన్గిడీ
తబ్రయిజ్ షంసీ

4. ఆస్ట్రేలియా
జోష్ హాజిల్‌వుడ్
ఆడమ్ జంపా

5. న్యూజిల్యాండ్
ట్రెంట్ బౌల్ట్
లచలాన్ ఫెర్గూసన్

6. శ్రీలంక
వానిందు హసరంగ
మహీష్ తీక్షణ

7. ఇంగ్లండ్
మార్క్ వుడ్
రీస్ టాప్లే

8. పాకిస్తాన్
మహమ్మద్ వాసిమ్
హారీస్ రవూఫ్

9. బంగ్లాదేశ్
షకీబ్ అల్ హసన్
ముస్తాఫిజుర్ రెహ్మాన్

10. వెస్టిండీస్
ఓబెడ్ మెకాయ్
జేసన్ హోల్డర్

11. ఐర్లాండ్
జోష్ లిటిల్
మార్క్ అడయార్

12. జింబాబ్వే
ల్యూక్ జాంగ్‌వే
టెండాయ్ ఛతారా

13. నమీబియా
జాన్ ఫ్రైలింక్
జేజే స్మిత్

14. స్కాట్లాండ్
మార్క్ వ్యాట్
సఫయాన్ షరీఫ్

15. నెదర్లాండ్స్
ఫ్రెడ్ క్లాసెన్
బ్రాండన్ గ్లోవర్

16. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
జహూర్ ఖాన్
జునైద్ సిద్దిఖీ

ఇవి కూడా చదవండి: