Breaking News

2009లో యుద్దం ముగిసినందునే అలా మాట్లాడాను.. ముత్తయ్య మురళీధరన్ 

17 th Oct 2020, UTC

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్  '800 లో మురళీధరన్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటించడంపై తమిళ సంఘాలు, సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జాతీయ జట్టుకు ఆడి మురళీధరన్‌ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత జీవితం, క్రికెట్ జీవితం గురించి చాలా మంది మాటలన్నారు. ఇప్పుడు '800' చిత్రం కూడా నా జీవితం గురించే చర్చిస్తుంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తాయి. అయితే, నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు.

ఈ చిత్రాన్ని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు. గత ఏడాది నేను 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అయితే కొందరు దీన్ని వక్రీకరించి శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్‌కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం ముగిసింది. పదేళ్లుగా ఇరువైపులా మరణాలు లేవు. అందుకే, 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అమాయకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను అని మురళీధరన్‌ స్పష్టం చేశారు. 

అంతేకాక ‘నా జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినప్పుడు మొదట నేను తటపటాయించా. కానీ, ఆ విషయం గురించి ఆలోచించన తర్వాత, మురళీధరన్‌గా నేను సాధించిన విజయాలు నా ఒక్కడివే కాదనిపించింది. నా తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. నా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అందరూ నా వెనుక ఉన్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను అని తెలిపారు. మరోవైపు ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా శ్రీలంక మత వాదానికి పూర్తిగా మద్దతు పలికిన మురళీధరన్‌ బయోపిక్‌లో నటిస్తే తమిళులను అవమానించేనట్లేని అభిప్రాయపడ్డాడు. పీఎంకే చీఫ్ డాక్టర్ పి రామదాస్ మాట్లాడుతూ, విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతాడని తెలిపారు. అయితే  చిత్ర నిర్మాతలు  ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బయోగ్రఫీ" అని, దీనిలో శ్రీలంకలో తమిళుల పోరాటాలను తక్కువ చేసే సన్నివేశాలను చూపించమని చెప్పారు. ఈ వివాదాలపై విజయ్ సేతుపతి ఇంకా స్వయంగా స్పందించలేదు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox